పెళ్ళైన తరవాత ప్రియమణి చూపు కొత్త క్యారెక్టర్ల మీద పడిందని చెప్పుకోవాలి. కెరీర్ స్టార్టింగులో కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్గా నటించినప్పటికీ… తరవాత తరవాత కొత్త క్యారెక్టర్లు చేస్తున్నారు. కొత్త సినిమా ‘కొటేషన్ గ్యాంగ్’లో అయితే సుపారీ తీసుకుని హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్‌గా నటించడానికి రెడీ అన్నారు. నేషనల్ అవార్డు విన్నర్ బాలా దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసిన వివేక్ డైరెక్షన్ చేస్తున్న సినిమా ‘కొటేషన్ గ్యాంగ్’. ముంబయ్‌లోని ధారవి స్లమ్ ఏరియా నుండి వచ్చే కాంట్రాక్ట్ కిల్లర్ శకుంతలగా ఈ సినిమాలో ప్రియమణి కనిపించనుంది.
ఫీమేల్ సెంట్రిక్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎల్జిబిటిక్యూ సమస్యలు డిస్కస్ చేస్తారట. సినిమా కోసం ధారవి వెళ్లి రీసెర్చ్ చేశానని డైరెక్టర్ వివేక్ చెబుతున్నాడు. కాంట్రాక్ట్ కిల్లర్ క్యారెక్టర్‌కి ప్రియమణి పర్ఫెక్ట్ అంటున్నాడు. మరీ యంగ్ కాకుండా, అలాగని మెచ్యూర్డ్ కాని హీరోయిన్ ఎవరున్నారని చూసినప్పుడు ప్రియమణి కనిపించిందని చెప్పాడు. సౌతిండియన్ లాంగ్వేజెస్‌తో పాటు హిందీలో సినిమాను విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ప్రియమణికి మార్కెట్ ఉంది. ఆల్రెడీ హిందీలో షారుఖ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’లో ఐటమ్ సాంగ్ చేశారు.
ప్రజెంట్ అజయ్ దేవగణ్ ‘మైదాన్’లో నటిస్తున్నారు. అందుకని, అన్ని భాషల్లో రిలీజ్ చెయ్యాలనుకుంటున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌లో పెళ్ళైన మహిళగా, మనోజ్ బాజ్‌పాయి భార్యగా నటించారు. ప్రజెంట్ ‘నారప్ప’లో వెంకటేష్ భార్యగా నటిస్తున్నారు. ‘విరాటపర్వం’లో మావోయిస్టుగా నటిస్తున్నారు.