ఎట్టకేలకు ‘గ్యాంగ్ లీడర్’ భామకు ఛాన్స్ దక్కింది…!

గతేడాది విడుదలైన ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ చిత్రం ఓపెనింగ్స్ బాగానే రాబట్టినప్పటికీ.. తరువాత చతికిల పడిపోయింది. హీరో నాని క్రేజ్ అలాగే దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాల పై ప్రేక్షకులకి ఉండే నమ్మకం కానీ ఈ చిత్రాన్ని ప్లాప్ నుండీ కాపాడలేకపోయాయి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా చేసిన ప్రియాంక అరుళ్ మోహన్ ను మాత్రం అంత ఈజీగా ఎవ్వరూ మర్చిపోలేరు.పెద్ద ఎత్తున ఈమె గ్లామర్ షో ఏమీ చెయ్యలేదు. కానీ నటనతో మాత్రం వందకు వంద మార్కులు వేయించుకుంది.

కుర్ర కారుకి ఈమె క్రష్ గా మారిపోయింది.అయితే సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఈమె రెండో సినిమా ఓకే అవ్వడానికి చాలా టైం పట్టింది. ఎట్టకేలకు ఈమె రెండో సినిమా ఓకే అయ్యింది. వివరాల్లోకి వెళితే…’సుకుమార్ రైటింగ్స్’ అలాగే ‘జిఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్లో ’18 పేజెస్’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

 

నిఖిల్ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్ హీరోయిన్ గా ఎంపిక అయ్యిందట. త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ చిత్రం మినిమం గ్యారెంటీ అనే ముద్ర ఆల్రెడీ ఉంది. ఆ రకంగా చూసుకుంటే ప్రియాంకా అరుళ్ మోహన్ గోల్డెన్ ఛాన్స్ కొట్టినట్టే అని చెప్పడంలో సందేహం లేదు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45


Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus