తెలుగు సినీ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు ఉన్నటువంటి అలనాటి తార రాధా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఒకప్పుడు తెలుగు తమిళ భాష చిత్రాలలో నటిస్తూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె పెళ్లి తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. పెళ్లి తర్వాత తన భర్త వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నటువంటి ఈమె తిరిగి ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలలో ప్రసారమవుతున్నటువంటి డాన్స్ షోలకు జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు.
ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా బిజీగా ఉన్న రాధ తాజాగా తన పెద్ద కూతురు కార్తిక నాయర్ కి ఎంతో ఘనంగా వివాహం చేశారు. పెళ్లి వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ పెళ్లి వేడుకలలో భాగంగా కార్తీక వేసుకున్నటువంటి నగలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈమె ఒంటి నిండా భారీ స్థాయిలో నగలను వేసుకొని కనిపించారు.
ఇక వీరి వివాహం కేరళ సాంప్రదాయం ప్రకారం కేరళలోని ఒక రిసార్ట్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు పలువురు సినీ సెలబ్రిటీలు అందరూ కూడా తరలివచ్చారు. ఇలా పెళ్లి వేడుకలలో కార్తీక అందంగా ముస్తాబవడమే కాకుండా పెద్ద ఎత్తున నగలు వేసుకోవడంతో వీరికి ఎంత మొత్తంలో ఆస్తులు ఉన్నాయనే విషయం గురించి వార్త వైరల్ గా మారింది.
ఇక రాధ (Radha) హస్బెండ్ ఎన్నో వ్యాపార రంగాలలో కొనసాగుతూ ఉన్నారు. వీరికి ఇండియాలోనే కాకుండా దుబాయ్ లో కూడా హోటల్ బిజినెస్ లో ఉన్నాయి. ఇలా రాధా తన భర్త సంపాదన మొత్తం కలిపి 300 కోట్లకు పైగా ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఇక రాధ కుమార్తె కార్తీక కూడా బిజినెస్ మేన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!
కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!