బాలీవుడ్ ముద్దుగుమ్మ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె చేసే పాత్రలు, మాట్లాడే మాటలు సంచనలమవుతుంటాయి. కొన్నేళ్ల క్రితం ఆమెకి సంబంధించిన ఓ న్యూడ్ క్లిప్ ఒకటి లీక్ అయి ఇంటర్నెట్ లో వైరల్ కావడం తెలిసిందే. ‘క్లీన్ షేవెన్’ అనే షార్ట్ ఫిలింకి సంబంధించిన క్లిప్ అది. దాని గురించి జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నారు. ఈ విషయంలో రాధికను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు.
ఈ విషయాలను ఆమె పెద్దగా పట్టించుకోదని అందరూ అనుకున్నారు. కానీ ఆ వీడియో లీక్ కావడం తనను బాగా ఇబ్బంది పెట్టిందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది రాధికా. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఎవరేం అనుకుంటున్నారు..? మీడియా వాళ్లు ఏం రాస్తున్నారు..? అనేది తాను పెద్దగా పట్టించుకోలేదని.. కానీ తన చుట్టూ ఉన్న వాళ్లే ఆడో రకంగా చూడడం వలన చాలా ఇబ్బందికి గురయ్యానని రాధికా చెప్పింది. వీడియోలో ఉన్న తానేనని గుర్తించిన తమ వాచ్ మ్యాన్,
డ్రైవర్ లాంటి వాళ్లు అదోలా చూడడం మొదలుపెట్టారని వాళ్లను ఫేస్ చేయలేక తను నాలుగు రోజుల పాటు ఇంటికే పరిమితమయ్యానని చెప్పుకొచ్చింది. ఆ తరువాత ‘పార్చ్డ్’ సినిమాలో పూర్తి నగ్నంగా కనిపించానని.. ఆ రోల్ లో నటించిన తరువాత ధైర్యం వచ్చిందని.. ఇక తాను దాచుకోవడానికి ఏమీ లేదనే అభిప్రాయానికి వచ్చి అప్పటినుండి ధైర్యంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది.
Most Recommended Video
టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!