కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి గౌడ భార్య అయిన రాధిక కుమారస్వామి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో ఆమె తారక రత్న సరసన ‘భద్రాద్రి రాముడు’, కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అవతారం’ వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది.అయితే ఈ సినిమాలు ప్లాప్ అవ్వడంతో రాధిక తెలుగు సినిమాల్లో మళ్ళీ కనిపించలేదు. కన్నడలో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది. నిర్మాత కుమారస్వామి తో పరిచయం ఏర్పడ్డాక ఆయన్ని వివాహం చేసుకుంది.
పెళ్లయ్యాక కూడా పలు సినిమాల్లో గ్లామర్ రోల్స్ చేసింది ఈ బ్యూటీ.ఈమెకు ఓ కూతురు కూడా ఉంది. కుమారస్వామి కంటే ముందు ఆమె రతన్ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. తర్వాత అతను మరణించడం జరిగింది. రాధిక కుమారస్వామి ఇప్పటికీ హీరోయిన్ గా రాణించాలి అని భావిస్తుంది. అందుకోసం ఫిట్ నెస్ ను మెయింటైన్ చేస్తూ, సోషల్ మీడియాలో డ్యాన్స్ వీడియోలు, తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.
తాజాగా ఆమె ఓ డాన్స్ వీడియోను షేర్ చేసింది.ఈ వీడియోలో తన ట్రైనర్తో కలిసి వీర లెవెల్లో మాస్ స్టెప్పులేస్తూ కనిపించింది ఈ బ్యూటీ. ఆమె చాలా ఉత్సాహంతో డాన్స్ చేసింది.. ఆ మూమెంట్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ చివర్లో ఆమె కాలు జారి పడిపోయింది. అప్పటికే రాధిక ఓపిక అయిపోవడంతో అలా జారి పడిపోయినట్లు స్పష్టమవుతుంది. కాగా రాధిక వయసు ఇప్పుడు 35 ఏళ్ళు మాత్రమే కావడం విశేషం గా చెప్పుకోవాలి..!