Sada: అలా విడిపోవడం కంటే.. పెళ్లి చేసుకోకపోవడం మంచిది.. సదా షాకింగ్ కామెంట్స్!

సదా అందరికీ సుపరిచితమే. 2002 లో వచ్చిన ‘జయం’ సినిమాతో ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘నాగ’ ‘ప్రాణం’ ‘టక్కరి’ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో నటించి మెప్పించింది. అటు తర్వాత కొత్త భామల ఎంట్రీతో ఫేడౌట్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె బుల్లితెర పై పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తోంది. ‘అహింస’ సినిమాతో ఆమె రీ ఎంట్రీ ఇచ్చినా.. అది ప్లాప్ అవ్వడంతో ఈమెకి కలిసొచ్చిందేమి లేదు. ఇదిలా ఉండగా..

తాజాగా ఆమె మెగా డాటర్ నిహారిక గురించి షాకింగ్ కామెంట్స్ చేసినట్టు ప్రచారం మొదలైంది. ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్ళైన తర్వాత ఫ్రీడమ్ అనేది మిస్ అవుతుంది. సో నాకు నచ్చింది నేను చేయలేను. అందుకే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు.ఒకవేళ చేసుకోవాలి అంటే.. మనల్ని అర్థం చేసుకుని.. కొంత ఫ్రీడమ్ ఇచ్చే పర్సన్ కావాలి. నా ప్రొఫెషన్ ను అర్థం చేసుకోగలగాలి. అలాంటి వ్యక్తి దొరికితే లైఫ్ హ్యాపీగా ఉంటుంది.

నేను (Sada) అలాంటి వ్యక్తి కోసమే ఎదురుచూస్తున్నాను. లేదంటే ప్రొఫెషనల్ లైఫ్ లో ఇప్పటిలా ఉండలేను.ఇది ఆలోచించకుండా చాలా మంది పెళ్లిళ్లు చేసుకుని తర్వాత ఇబ్బంది పడుతున్నారు. విడాకులు కూడా తీసుకుంటున్నారు. గ్రాండ్ గా పెళ్లి చేసుకుని.. విడాకులు తీసుకుంటున్న వాళ్ళు ఈ మధ్య ఎక్కువవుతున్నారు.

దాని కంటే పెళ్ళి చేసుకోకుండా ఉంటేనే బెటర్ అని నా ఉద్దేశం’ అంటూ సదా చెప్పుకొచ్చింది. ఆమె ఈ కామెంట్స్ చేయడానికి నిహారిక కారణమని.. ఆమెను ఉద్దేశించే పరోక్షంగా సదా ఈ కామెంట్స్ చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus