Sadha: బాలయ్యపై షాకింగ్ కామెంట్స్ చేసిన సదా..!

తేజ డైరెక్షన్ లో నితిన్ హీరోగా తెరకెక్కిన జయం సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన సదా ఈటీవీలో ప్రసారమవుతున్న అలీతో సరదాగా షోకు హాజరై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సదా సినీ కెరీర్ లో జయం, అపరిచితుడు బిగ్గెస్ట్ హిట్లు కాగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాగ సినిమాలో, బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరభద్ర సినిమాలో సదా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో సదాకు సినిమా ఆఫర్లు తగ్గగా జూనియర్ ఎన్టీఆర్ లా డ్యాన్స్ చేసేవారిని తాను ఇంతవరకు చూడలేదని సదా అన్నారు.

ఎంత పెద్ద మూవ్ మెంట్స్ అయినా ఆయన ఇచ్చి ఒకేసారి చూసి టేక్ చేస్తారని రిహార్సల్ చేయకుండా అలా చేయడం ఎలా సాధ్యమో తనకు అర్థం కాదని సదా చెప్పుకొచ్చారు. వర్క్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కు మక్కువ ఎక్కువని సదా వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ చాలా సిన్సియర్ అని డెడికేటెడ్ అని సదా పేర్కొన్నారు. బాలకృష్ణ గారు చిన్నపిల్లలు ఎలా ఉంటారో అలానే ఉంటారని సదా షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలయ్య చాలా ఎనర్జీతో ఉంటారని చాలా యాక్టివ్ గా ఉంటారని సదా చెప్పుకొచ్చారు.

విక్రమ్ గొప్ప యాక్టర్ అయినా రిలాక్స్ గా, హ్యాపీ ఉంటారని సదా తెలిపారు. మాధవన్ తో మూడు సినిమాలు చేయడంతో అఫైర్ ఉందని ప్రచారం జరిగిందని సదా వెల్లడించారు. గాసిప్స్ అనేవి అనవసరమని తనకు అనిపిస్తుందని సదా పేర్కొన్నారు.


తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus