Filmfare Paper Cuts: వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!

  • June 24, 2021 / 11:40 AM IST

సినిమాలకు అవార్డుల పేరుతో మరో రంగును ఇచ్చే ఫిల్మ్ ఫేర్ అవార్డుల గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 65 ఏళ్ళ నుంచి ఇండియన్ సినిమాకు సంబంధించిన నటీనటులకు టెక్నీషియన్స్ కు పురస్కారాలను అందిస్తూ మ్యాగజైన్ ద్వాఏఆ మంచి బూస్ట్ ఇస్తున్న ఫిల్మ్ ఫేర్ కు ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఫిల్మ్ ఫేర్ కవర్ పేజ్ అంటే ఇప్పటికి కూడా చాలా స్పెషల్ అని చెప్పవచ్చు. ఇక 20 ఏళ్ళ క్రితం ఫిల్మ్ ఫేర్ కవర్ పేజ్ పై మన సౌత్ సెలబ్రెటీల హవా గట్టిగానే నడిచింది. ఒకసారి ఆ మూమెంట్స్ పై ఒక లుక్కేద్దాం పదండి.

1997లో మెగాస్టార్ చిరంజీవి వరుస బాక్సాఫీస్ హిట్స్ తో బాలీవుడ్ ను సైతం ఎట్రాక్ట్ చేశారు. అదే క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం అప్పట్లో బాగా వైరల్ అయ్యింది. ఇక ఫిల్మ్ ఫేర్ కవర్ పేజ్ పై మెగా హీరోలు బ్రదర్ యాక్ట్ అంటూ ఇలా స్టిల్ ఇచ్చారు.

1997లో నాగార్జున కూడా అన్నమయ్య సినిమాకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ప్రయోగాలతో బాక్సాఫీస్ హిట్స్ అందుకోవడంలో హాట్ స్పాట్ గా నిలిచాడు.. నాగార్జున బెస్ట్ అంటూ కవర్ పేజ్ పై స్టైలిష్ స్టిల్ వేశారు.

ఆపద్బాంధవుడు, ముఠా మెస్ట్రీ సినిమాలకు బ్యాక్ టూ బ్యాక్ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ 1994 ఫిల్మ్ ఫేర్ కవర్ పేజ్ పై ఇలా స్టైలిష్ స్టిల్ తో దర్శనమిచ్చారు.

90లలో వరుస బాక్సాఫీస్ హిట్స్ తో దూసుకుపోతున్న సమయంలో రజనీకాంత్ విక్టరీకి కేరాఫ్ అడ్రస్ లా నిలిచాడు. 1993లో రజనీకాంత్ విక్టరీ అంటూ ఇలా పొజిచ్చారు.

శ్రీదేవి ఎలాంటి సినిమా చేసినా కూడా 1980లో భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావడం మొదలయ్యాయి. దీంతో మరో సందేహం లేకుండా నెంబర్ వన్ స్థాయిని అందుకున్నట్లు ఫిల్మ్ ఫేర్ కవర్ పై క్లారిటీ ఇచ్చేశారు.

ఇక 1994లో మరోసారి మెగాస్టార్ చిరంజీవి హాట్ పేవరేట్ అంటూ ఫిల్మ్ ఫేర్ సంబోధించింది. సౌత్ లో అప్పట్లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోగా కూడా మెగాస్టార్ ఒక రికార్డు అందుకున్నారు.

పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, రాజా వంటి హిట్ సినిమాలతో వెంకటేష్, సౌందర్య బెస్ట్ జోడి అనిపించుకున్నారు. ఇక గణేష్ సినిమాకు వెంకటేష్ బెస్ట్ యాక్టర్ గా, రాజా సినిమాకు గాను సౌందర్య బెస్ట్ హీరోయిన్ గా అవార్డులు అందుకొని 1999లో ఇలా ఫిల్మ్ ఫేర్ కవర్ పేజ్ పై దర్శనమిచ్చారు.

నిన్నే పెళ్లాడతా తరువాత హిందీలో విరాసట్ సినిమాకు టబు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. ఇక 1997లో వెంకటేష్ వరుస బాక్సాఫీస్ హిట్స్ తో గణేష్ సినిమాకు బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ గెలిచాడు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus