Nithin Rejected Movies: తన 20 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

  • June 14, 2022 / 02:35 PM IST

‘జయం’ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుతో 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. అంటే నితిన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కూడా 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. తన 20 ఏళ్ళ కెరీర్ లో నితిన్ దాదాపు అందరి స్టార్ డైరెక్టర్లతోనూ సినిమాలు చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో ‘సై’,త్రివిక్రమ్ డైరెక్షన్లో ‘అఆ’, వినాయక్ డైరెక్షన్లో ‘దిల్’, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ‘హార్ట్ ఎటాక్’, కృష్ణ వంశీ డైరెక్షన్లో ‘శ్రీ ఆంజనేయం’, తేజ డైరెక్షన్లో ‘జయం’ ‘ధైర్యం’ వంటి సినిమాలు చేశాడు. ఇదిలా ఉండగా.. ‘సై’ మూవీ తర్వాత నితిన్ ఏకంగా 12 ప్లాప్ లను ఫేస్ చేసాడు. ఆ టైములో నితిన్ పని ఇక అయిపోయింది అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అయినప్పటికీ ‘ఇష్క్’ ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యాడు నితిన్. ఎన్ని ప్లాప్ లను అతను ఎదుర్కొన్నా ఓ స్ట్రాంగ్ హిట్టు కొట్టి కం బ్యాక్ ఇవ్వగల సత్తా నితిన్ కు ఉంది.

సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తన 20 ఏళ్ళ కెరీర్ లో నితిన్ కొన్ని సినిమాలను మిస్ చేసుకున్నాడు. డేట్స్ అడ్జెస్ట్ కాలేకో లేక కథలు నచ్చకో తెలీదు కానీ.. కొన్ని సినిమాలను నితిన్ వదులుకున్నాడు. ఇందులో హిట్లు ఉన్నాయి. ప్లాప్ లు కూడా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్య:

ఈ కథని రిజెక్ట్ చేసిన హీరోలు చాలా మందే ఉన్నారు. ప్రభాస్,ఎన్టీఆర్,రవితేజ, అల్లరి నరేష్ ల తో పాటు నితిన్ కూడా ఉన్నాడు. ‘దిల్’ సినిమాకి సుకుమార్ కూడా పనిచేసాడు. ఆ చిత్రం షూటింగ్ తుది దశలో ఉండగా నితిన్ కు ‘ఆర్య’ కథ వినిపించాడు సుకుమార్. కానీ అప్పటికే నితిన్ వరుసగా 4 సినిమాలకు కమిట్ అవ్వడంతో చేయలేకపోయాడు. ఇప్పటికీ నితిన్- సుకుమార్ కాంబినేషన్లో సినిమా రాలేదు.

2) ధన 51:

సుమంత్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని బిగ్ బాస్ కంటెస్టెంట్ సూర్య కిరణ్ డైరెక్ట్ చేసాడు. మొదట ఈ కథని అతను నితిన్ కు వినిపించాడు. కానీ నితిన్ ఓకే చేయకపోవడంతో అది సుమంత్ కు వెళ్ళింది.

3) భలే దొంగలు:

తరుణ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి విజయ్ భాస్కర్ దర్శకుడు. ‘బంటీ ఔర్ బబ్లీ’ అనే బాలీవుడ్ మూవీ కి ఇది రీమేక్. మొదట ఈ కథ నితిన్ వద్దకు వెళ్ళింది కానీ.. అతను చేయలేదు.

4) మనం:

నితిన్ తో ‘ఇష్క్’ చేసిన దర్శకుడు విక్రమ్ కుమార్.. ‘మనం’ కథని కూడా మొదట నితిన్ కే వినిపించాడు. కానీ ఈ కథ అక్కినేని ఫ్యామిలీ కరెక్ట్ అని నితిన్ భావించి.. నాగ చైతన్య, నాగార్జున లకు విక్రమ్ కుమార్ ను పరిచయం చేసాడు నితిన్.

5) పిల్లా నువ్వు లేని జీవితం:

ఈ కథ కూడా మొదట నితిన్ వద్దకు వెళ్ళింది.ఈ చిత్రం దర్శకుడు రవికుమార్ అంతకుముందు నితిన్ తో ‘ఆటాడిస్తా’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో మళ్ళీ నితిన్ తో సినిమా చేయాలని ‘పిల్లా నువ్వు లేని జీవితం’ కథని నితిన్ కు చెప్పాడు. కానీ నితిన్ ఓకే చేయలేదు.

6) శతమానం భవతి:

మొదట ఈ కథకి సాయి తేజ్ హీరోగా ఎంపికయ్యాడు. అయితే అతనికంటే ముందుగానే ఈ కథ నితిన్ వద్దకు వెళ్ళింది. కానీ ఫైనల్ గా శర్వానంద్ చేయడం జరిగింది.

7) ఇస్మార్ట్ శంకర్:

ఈ చిత్రాన్ని మొదట నితిన్ తో చేయాలని పూరి భావించాడు. కానీ ప్రొడక్షన్ వ్యవహారాల విషయంలో తేడా వచ్చి.. నితిన్ తప్పుకున్నట్టు తెలుస్తుంది.

8) రాక్షసుడు(రాట్ససన్):

మొదట ఈ రీమేక్ నితిన్ వద్దకు వెళ్ళింది. కానీ అతను ఓకే చేయలేదు.

9) గల్లీ బాయ్(రీమేక్):

బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ తో చేయాలని ఓ దర్శకుడు ప్లాన్ చేసాడు. కానీ అతను నో చెప్పడంతో.. అది ‘గీతా ఆర్ట్స్’ కాంపౌండ్ కు వెళ్ళింది. ఇప్పటికీ ఆ కథను ఎవ్వరూ చేయలేదు.

10) ఒరేయ్ బుజ్జిగా:

‘గుండె జారి గల్లంతయ్యిందే’ దర్శకుడు విజయ్ కుమార్ మొదట ఈ కథని నితిన్ కు వినిపించాడు. కానీ అతను ఓకే చేయలేదు.

11) పవర్ పేట:

కృష్ణ చైతన్య డైరెక్షన్లో ‘పవర్ పేట’ అనే చిత్రాన్ని చేయాలనుకున్నాడు నితిన్. సత్యదేవ్ మరో హీరోగా ఎంపికైనట్టు కూడా నితిన్ కన్ఫర్మ్ చేసాడు. కానీ ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టినట్టు సమాచారం.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus