Vijay: టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

గతంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కి..తెలుగులో అంతగా మార్కెట్ ఉండేది కాదు. అతని కంటే సూర్య, కార్తీ,విశాల్.. వంటి హీరోల సినిమాలకే ఇక్కడ మంచి మార్కెట్ ఉండేది..! అయితే ‘తుపాకీ’ ‘జిల్లా’ సినిమాల నుండీ సైలెంట్ గా టాలీవుడ్లో మార్కెట్ పెంచుకుంటూ వచ్చాడు విజయ్. ‘అదిరింది'(మెర్సల్), ‘సర్కార్’,’విజిల్'(బిగిల్), ‘మాస్టర్’.. వంటి చిత్రాలతో తెలుగులో వరుస హిట్లు కొట్టి.. తన మార్కెట్ ను రూ.15 కోట్లకు పెంచుకున్నాడు విజయ్. దీంతో ఇప్పుడు అతను ఏకంగా తెలుగులో స్ట్రైట్ మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపల్లితో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఇది ద్విభాషా చిత్రంగా రూపొందింది.

ఇదిలా ఉండగా.. గతంలో విజయ్ ఎందుకని టాలీవుడ్ మార్కెట్ పై ఫోకస్ చేయలేదు అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. దానికి ప్రధాన కారణం.. గతంలో విజయ్ కేవలం రీమేక్ లనే నమ్ముకునేవాడు. అందులోనూ అతను తెలుగులో హిట్టైన సినిమాలను వరుసగా తమిళంలో రీమేక్ చేసేవాడు. వాటిని మళ్ళీ తెలుగులోకి డబ్ చేయడం ఎందుకని భావించి.. తెలుగు మార్కెట్ వైపు అతను కన్నెత్తి చూడలేదు. సరే ఈరోజు విజయ్ పుట్టినరోజు కావడంతో తెలుగులో రీమేక్ అయిన విజయ్ సినిమాలను.. అలాగే తమిళంలో విజయ్ రీమేక్ చేసిన తెలుగు సినిమాలను ఓ లుక్కేద్దాం రండి :

తెలుగులో రీమేక్ అయిన విజయ్ 9 తమిళ సినిమాలు :

1) ఖైదీ నెంబర్ 150 :

తమిళంలో మురుగదాస్- విజయ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘కత్తి’ చిత్రాన్ని తెలుగులో చిరు-వినాయక్ కాంబినేషన్లో ‘ఖైదీ నెంబర్ 150’ గా రీమేక్ చేశారు.

2) ఖుషి :

పవన్ కళ్యాణ్ -ఎస్.జె.సూర్య కాంబినేషన్లో వచ్చిన ‘ఖుషి’ మూవీ.. తమిళ రీమేక్ అన్న సంగతి తెలిసిందే.మొదట ఎస్.జె.సూర్య అక్కడ విజయ్ తో చేసాక.. దాన్ని తెలుగులో రీమేక్ చేసాడు.

3) అన్నవరం :

విజయ్- త్రిష జంటగా నటించిన ‘తిరుపచి’ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్- ఆసిన్ లతో రీమేక్ చేసాడు దర్శకుడు భీమనేని శ్రీనివాస రావు.

4)గౌరి :

తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘తిరుమలై’ చిత్రాన్ని తెలుగులో సుమంత్ హీరోగా ‘గౌరి’ పేరుతో రీమేక్ అయ్యింది.

5)శుభాకాంక్షలు :

తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘పూవె ఉనక్కాగ’ చిత్రాన్ని జగపతి బాబుతో ‘శుభాకాంక్షలు’ గా తెరకెక్కించారు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు.

6) ప్రేమించే మనసు :

తమిళంలో విజయ్ హీరోగా తెరకెక్కిన ‘ప్రియముదన్’ చిత్రాన్ని తెలుగులో ‘ప్రేమించే మనసు’ గా రీమేక్ చేసారు.

7)సుస్వాగతం :

తమిళంలో విజయ్ హీరోగా నటించిన ‘లవ్ టుడే’ చిత్రాన్ని తెలుగులో పవన్ కళ్యాణ్ తో ‘సుస్వాగతం’ గా తెరకెక్కించాడు దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు.

8)నువ్వు వస్తావని :

విజయ్ నటించిన ‘తుల్లత మనమం తుల్లుమ్’ అనే చిత్రాన్ని తెలుగులో నాగార్జునతో ‘నువ్వు వస్తావని’ గా రీమేక్ చేశారు.

9)విజయదశమి :

తమిళంలో విజయ్ నటించిన ‘శివకాశి’ మూవీని తెలుగులో కళ్యాణ్ రామ్ తో ‘విజయదశమి’ గా రీమేక్ చేసాడు దర్శకుడు సముద్ర.

విజయ్ హీరోగా తమిళంలో రీమేక్ అయిన 8 తెలుగు సినిమాలు :

1) పవిత్ర బంధం : ప్రియమానవలె

2) తమ్ముడు : బద్రి

3)చిరునవ్వుతో : యూత్

4)నువ్వు నాకు నచ్చావ్ : వసీగరా

5)పెళ్లి సందడి : నినైతన్ వందై

6)పోకిరి : పోకిరి

7)అతనొక్కడే : అత్తి

8)ఒక్కడు : గిల్లి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus