Samantha: సరికొత్త లుక్ లో సమంత.. వైరల్ అవుతున్న ఫోటో!

సమంత కొంత గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ తో బిజీగా గడుపుతోంది. ఇటీవల కేరళలో ‘ఖుషి’ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకొచ్చిన సమంత.. ఆ తర్వాత గ్యాప్ లేకుండా ‘శాకుంతలం’ సినిమా ప్రమోషన్లలో పాల్గొంది. అటు తర్వాత ఆమె లండన్ వెళ్ళింది. హిందీలో ‘ఫ్యామిలీ మెన్ 2’ మేకర్స్ తెరకెక్కిస్తున్న ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ లో సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. వరుణ్ ధావన్ ఇందులో మెయిన్ లీడ్ గా కనిపిస్తున్నాడు.

‘సిటాడెల్’ హాలీవుడ్ సిరీస్ లో ప్రియాంక చోప్రా నటించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ కు సంబంధించి నిన్న లండన్ లో ఒక ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో సమంత, ప్రియాంక చోప్రాతో పాటు ‘సిటాడెల్’ టీం అంతా సందడి చేసింది. అయితే ఈ వేడుకలో సమంత లుక్ అందరినీ ఆకట్టుకుంది. బ్లాక్ ఔట్ ఫిట్స్ లో సమంత లుక్ చాలా కొత్తగా ఉంది. హాలీవుడ్ సెలబ్రిటీస్ తో కలిసి సమంత ఆ లుక్ లో కనిపించడంతో ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇక ఇటీవల సమంత (Samantha) నుండీ వచ్చిన ‘శాకుంతలం’ చిత్రం ప్లాప్ అయ్యింది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో సమంత.. శకుంతల పాత్రలో చాలా చక్కగా కనిపించింది కానీ ఆ పాత్రకు తగ్గ పెర్ఫార్మన్స్ అయితే ఇవ్వలేకపోయింది. ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కిందా మీదా పడుతుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి సమంత లేటెస్ట్ లుక్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus