Shilpa Shetty: అభిమానులకు భారీ షాకిచ్చిన శిల్పాశెట్టి!

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి ఈ మధ్య కాలంలో పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారనే సంగతి తెలిసిందే. శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ కావడంతో శిల్పాశెట్టి రాజ్ కుంద్రాకు విడాకులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. భర్త అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాడని తనకు తెలియదని శిల్పాశెట్టి చెప్పడంతో శిల్పాశెట్టి ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారని చాలామంది భావించారు. అయితే అభిమానులకు మాత్రం శిల్పాశెట్టి తాజాగా భారీ షాక్ ఇచ్చారు.

తాను, రాజ్ కుంద్రా అన్యోన్యంగానే ఉన్నామని ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఘటనల వల్ల తమ బంధం మరింత బలపడిందని శిల్పాశెట్టి చెప్పుకొచ్చారు. పనిలో పడితే కొన్ని ఘటనలను మరిచిపోవచ్చని ప్రస్తుతం తాను అదే పని చేస్తున్నానని శిల్పాశెట్టి తెలిపారు. శిల్పాశెట్టి చేసిన కామెంట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత శిల్పాశెట్టి బ్రాండ్ వాల్యూ పడిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు శిల్పాశెట్టితో ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలను సైతం రద్దు చేసుకున్నాయి.

రాజ్ కుంద్రా బెయిల్ పై రిలీజ్ కాగా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా కలిసి ఒకే ఇంట్లో జీవనం సాగిస్తున్నారు. శిల్పా శెట్టికి తెలిసే రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను తీశారని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అశ్లీల చిత్రాల కేసు వల్ల శిల్పాశెట్టికి భవిష్యత్తులో సైతం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. శిల్పాశెట్టికి సినిమా ఆఫర్లు కూడా రావడం కష్టమేనని తెలుస్తోంది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus