బుల్లితెర నటే అయినప్పటికీ స్టార్ హీరోయిన్ల రేంజ్లో క్రేజ్ ను సంపాదించుకున్న నటి మౌనీరాయ్.నాగిని సీరియల్ ద్వారా ఈమె బాగా పాపులారిటీని సంపాదించుకుంది. ఈ మధ్యనే ప్రముఖ బిజినెస్ మెన్ సూరజ్ నంబియార్‌ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సోషల్ మీడియాలో ఈమె చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈమె పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. తన స్నేహితురాలి పై ఉన్న ప్రేమని వ్యక్తం చేస్తూ ఈమె చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి.
వివరాల్లోకి వెళితే.. మౌనీరాయ్ బెస్ట్‌ఫ్రెండ్ రూపాలి బర్త్‌డే సందర్భంగా ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. ‘నువ్వు నన్ను 50 వ అంతస్తు పై నుండీ దూకమని చెప్పినా ఏమాత్రం ఆలోచించకుండా దూకేస్తాను. నువ్వు నాతో గొడవ పడినప్పుడు కొన్ని నెలల వరకు అయినా నీతో మాట్లాడకుండా ఉండాలి అనుకుంటాను కానీ ఒక గంట కూడా ఉండలేను. నువ్వు ఇప్పటికీ, ఎప్పటికీ నా ప్రాణస్నేహితురాలివి.’హ్యాపీ బర్త్‌డే రూప్సీ. ఇలాగే ఎన్నో న్యూ ఇయర్, వాలెంటైన్స్ డే, హోలీ వంటి ఎన్నో హాలీడేస్‌ను కలసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
నువ్వు నా దానివి. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తుంటాను’ అంటూ కొన్ని గ్లామర్ ఫోటోలను షేర్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది మౌనీరాయ్. ఈ పోస్ట్ కు నెటిజన్లు వివిధ శైలిలో కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది పాజిటివ్ గా మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఇలాగే కలిసుండాలి అని కామెంట్లు చేస్తున్నారు. మరికొంతమంది అయితే ‘డేంజరస్ కాంబో’ అంటూ వర్మ స్టైల్ లో కామెంట్స్ చేస్తున్నారు.