టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి గుర్తింపు పొందినటువంటి వారిలో శ్రద్ధాదాస్ ఒకరు. ఈమె హీరోయిన్ గా పలు సినిమాలలో నటించినప్పటికీ సెకండ్ హీరోయిన్ గా మాత్రమే నటించారు. ఇక సెకండ్ హీరోయిన్గా నటించిన ఈమెకు పెద్దగా అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి శ్రద్ధాదాస్ బుల్లితెర కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇక ఈమె హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాలలో నటించారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో శ్రద్ధాదాస్ నటించిన జిద్ సినిమాలో ప్రియాంక చోప్రా సోదరీ మన్నారా చోప్రా విలన్ పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈమె హిందీ బిగ్ బాస్ కార్యక్రమంలో టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా ఉండడంతో ఆమె గురించి శ్రద్ధాదాస్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మన్నారా చోప్రా జిద్ సినిమాలో నటిస్తున్న సమయంలో నన్ను బాగా కొట్టిందని ఆమె కొట్టడంతో ఏకంగా కోమాలోకి వెళ్లే పరిస్థితులు కూడా వచ్చాయని తెలిపారు.
ఈ సినిమాలో నటిస్తున్నటువంటి సమయంలో మెట్ల పైనుంచి నన్ను తోసే సన్నివేశం ఉంది డైరెక్టర్ మెల్లగా తోయాలి అని చెబుతున్నప్పటికీ తన బలం మొత్తం ఉపయోగించి నన్ను మెట్ల పైనుంచి తోసిందని ఆ దెబ్బకు నేను హాస్పిటల్ పాలయ్యానని కోమాలోకి కూడా వెళ్లే పరిస్థితులు వచ్చాయని తెలిపారు. అలాగే మరోసారి నా చాతి పై కొట్టే సన్నివేశంలో మెల్లిగా కొట్టమని నేను తనకి చెప్పను కానీ ఆమె (Shraddha Das) తన బలం మొత్తం ఉపయోగించి నన్ను కొట్టింది అంటూ శ్రద్ధాదాస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.