తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా.. టాప్ పొజిషన్లో ఉండేది శృతీ హాసన్. ప్రతీ పెద్ద సినిమాకి దర్శకనిర్మాతలు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా అనుకునేవారు. అయితే ఇదంతా 3 ఏళ్ళ క్రితం మాట. తరువాత విదేశీయుడు కోర్సల్ తో ప్రేమలో పడడం.. అది పెళ్లి వరకూ వెళ్లడం జరిగింది.ఆ టైములో సినిమా కెరీర్ ను బాగా నెగ్లెక్ట్ చేసింది. కానీ తరువాత వీరి మధ్య మనస్పర్థలు రావడంతో బ్రేకప్ అయిపోయారు.
అయితే శృతీ మాత్రం తాను బాయ్ ఫ్రెండ్ జ్ఞాపకాల నుండీ బయటకి రాలేకపోతుందని ఇటీవల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మ్యాటర్ ఏంటంటే.. ఆమె బాయ్ ఫ్రెండ్ ది లండన్ అన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో ఈమె లండన్ లో దిగిన ఓ ఫొటోను షేర్ చేసింది . “ఐ మిస్ లండన్” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.అక్కడితో అయిపోలేదు… లండన్ లోని ‘బోన్ డాడీస్’ అనే రెస్టారెంట్ అంటే ఈమెకు చాలా ఇష్టమని..
దానిని కూడా మిస్ అవుతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక శృతీ హ్హసన్ ప్రస్తుతం రవితేజ ‘క్రాక్’ అలాగే ‘వకీల్ సాబ్’ వంటి చిత్రాలలో నటిస్తుంది. అంతేకాకుండా నాగ అశ్విన్ డైరెక్షన్ లో ఓ చిన్న వెబ్ మూవీలో కూడా నటించింది.