నిర్మాతకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నటి శృతీ..!

  • April 5, 2019 / 01:14 PM IST

ఇండియా వైడ్ ‘మీటూ’ ఉద్యమం ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో ఉండే, కాస్టింగ్ కౌచ్ తో పాటూ పలువురు సినీ దర్శకనిర్ణమతాలు, హీరోలు తమను వేధిస్తున్నారని కొంతమంది నటీమణులు మీడియా, సోషల్ మీడియా ను వేదికగా చేసుకుని వారు ఎదుర్కొన సమస్యలను భయటపెట్టారు. ఈ ఉద్యమం మొదలయ్యి దాదాపు 8 నెలలు గడిచినప్పటికీ ఇంకా చల్లారినట్టు కనిపించడం లేదు. తాజాగా మరో నటి ఎదుర్కొన్న సమస్యని వెలుగులోకి తెచ్చింది. పలు తమిళ, మరాఠీ సినిమాల్లో నటించిన శృతి మరాటే… ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు సినిమాలు చేస్తుంది. ఇక తాజాగా తాను ఎదుర్కొన్న ఓ ‘మీటూ’ సంఘటనను బయటపెట్టడం సంచలనం సృష్టిస్తుంది. గతంలో ఓ నిర్మాత తనతో తప్పుగా ప్రవర్తించాడని, అతడికి ధీటైన సమాధానం చెప్పానని ఆమె చెబుతుంది.

ఈ విషయం పై ఆమె మాట్లాడుతూ… ”అప్పట్లో సినిమా అవకాశం రావడమే గొప్ప కాబట్టి… అడిగిన వెంటనే బికినీ ధరించాను. నాకు కాస్త ఫేం వచ్చిన తరువాత ఆ బికినీ ఫోటోలను బాగా ట్రోల్ చేసారు కూడా. అయితే వాటిని నేను పెద్దగా పట్టించుకోను… కానీ ఓ నిర్మాత సినిమా ఆఫర్ ఇస్తానని నన్ను సంప్రదించాడు. మొదట బాగానే మాట్లాడాడు. కాసేపటికి కాంప్రమైజ్ అవ్వాలి, ఒకరాత్రి పడుకోవాలని చెప్పే సరికి షాకయ్యను. వెంటనే నేను..నీతో ఒకరాత్రి పడుకుంటే.. మరి హీరోతో ఎవరు పడుకుంటారని అతడిని ప్రశ్నించాను. ఇక నిర్మాత చెప్పిన దానికి నేను ఒప్పుకోకపోవడంతో నన్ను ఆ సినిమా నుండీ తప్పించారు.. అయినప్పటికీ నేను బాధపడలేదు. కేవలం మహిళల్లో ధైర్యం నింపడానికే మాత్రమే ఈ ఘటన గురించి చెబుతున్నాను.” అంటూ చెప్పుకొచ్చింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus