సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ అందరికీ సుపరిచితమే. గతంలో స్టార్ హీరోల సినిమాల్లో నటించి, అవి బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఒక 6 ఏళ్ల పాటు ఈమె తన స్టార్ స్టాటస్ ను కంటిన్యూ చేసింది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించిన సిమ్రాన్, మహేష్, ప్రభాస్ వంటి ఇప్పటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది, అయితే అది తమిళంలో మాత్రమే. తెలుగులో ఈమె సినిమాలు చేయడం లేదు.
అయితే ఈమె పర్సనల్ లైఫ్ లో విషాదం చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే..హీరోయిన్ సిమ్రాన్ మేనేజర్ అయిన ఎమ్. కామరాజన్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇతను 25 ఏళ్ల నుండి సిమ్రాన్ కి మేనేజర్ గా పని చేస్తూ వచ్చారు. అయితే బుధవారం నాడు ఆయన హఠాన్మరణం చెందారట. ఈ విషయాన్ని సిమ్రాన్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించి అలాగే కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
‘ఈ విశయాన్ని నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఓ రకంగా నాకు ఇది షాకింగ్ గా అనిపిస్తుంది. నా ప్రియ మిత్రుడు, కుటుంబ సభ్యుడు లాంటి వ్యక్తి ఎమ్. కామరాజన్ ఇక లేరు. ఆయన 25 ఏళ్లుగా నా కుడి భుజంగా ఉండి నన్ను నడిపించారు. సిమ్రాన్ అనే ప్రపంచానికి ఒక పిల్లర్‌లా నిలబడ్డారు. అత్యంత యాక్టివ్ గా వ్యక్తి. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవారు, నమ్మకంగా పనిచేసేవారు. మీరు లేని ఈ నా సినీప్రయాణాన్ని ఊహించుకోలేకపోతున్నాను’ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు.