మొత్తానికి సిమ్రాన్ క్లారిటీ ఇచ్చేసింది..!

Advertisement

ఇటీవల ఓ సందర్భంలో నటుడు మరియు దర్శకుడైన రాఘవ లారెన్స్.. ‘చంద్రముఖి2’ లో నటిస్తున్నట్టు చెప్పి కొత్త అనుమానాలకు తెరలేపాడు. 2005 లో విడుదలైన రజినీకాంత్, జ్యోతిక ల ‘చంద్రముఖి’ చిత్రానికి సీక్వెల్ అంటూ 2010లో ‘నాగవల్లి’ వచ్చింది. వెంకటేష్ నటించిన ఈ చిత్రానికి కూడా ‘చంద్రముఖి’ డైరెక్టర్ పి.వాసు నే తెరకెక్కించాడు. ‘చంద్రముఖి’ చిత్రం బ్లాక్ బస్టర్ అయ్యింది. దానికి సీక్వెల్ గా వచ్చిన ‘నాగవల్లి’ చిత్రం సినిమా పరంగా మెప్పించలేదు కానీ కలెక్షన్స్ ను అయితే రప్పించింది.

ఇక్కడ ఆల్రెడీ సీక్వెల్ వచ్చేసిన సినిమాకి.. ఇప్పుడు మళ్ళీ సీక్వెల్ అని చెప్పడమేంటి? అందులో లారెన్స్ నటించడం ఏంటి? అనే కన్ఫ్యూజన్ లో ప్రేక్షకులు ఉంటే.. మరోపక్క ఈ సీక్వెల్ లో జ్యోతిక పాత్రలో సీనియర్ స్టార్ హీరోయిన్ సిమ్రాన్ నటిస్తుంది అంటూ ప్రచారం జరుగుతుండడం మరో కన్ఫ్యూజన్ మొదలైంది. మొత్తానికి ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఉద్దేశంతో సిమ్రాన్.. క్లారిటీ ఇచ్చేసింది. ఆమె మాట్లాడుతూ.. ” ‘చంద్రముఖి2’ చిత్రంలో నేను నటిస్తున్నానంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదు.

నా అభిమానులకు ఇది నిరాశకు కలిగించే విషయమే కావచ్చు.. కాబట్టి నన్ను క్షమించండి. అలాంటి పాత్రల్లో నటించమని.. నన్ను ఇప్పటి వరకూ ఏ చిత్రబృందం సంప్రదించలేదు. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలను దయచేసి నమ్మకండి” అంటూ చెప్పుకొచ్చింది సిమ్రాన్. గతంలో తెలుగులో కూడా సిమ్రాన్.. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే.


Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus