దక్షిణాది భాషల్లోని సినిమాలలో నటించి సితార నటిగా ఒక వెలుగు వెలిగారనే సంగతి తెలిసిందే. సితార ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ కె.బాలచందర్ సితారను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. పలు టీవీ సీరియళ్లలో సితార నటించగా ఆ సీరియళ్లు సక్సెస్ సాధించడంతో బుల్లితెరపై కూడా సితారకు మంచి పేరు వచ్చింది. సితార శాస్త్రీయ నృత్య కళాకారిణి కూడా కావడం గమనార్హం.
ప్రస్తుతం సితార స్టార్ హీరోలకు అమ్మ, అత్త తరహా పాత్రలలో నటిస్తున్నారు. సితార సాఫ్ట్ రోల్స్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం. తాజాగా సితార మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు మెగా హీరోలైన అల్లు అర్జున్, రామ్ చరణ్ లతో నటించాలని ఉందని సితార కామెంట్లు చేశారు. తాను ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, మహేష్ తో కలిసి నటించానని ఆమె అన్నారు.
మహేష్ బాబు, తారక్ తో కలిసి నటించడం తనకు కంఫర్టబుల్ గా ఉంటుందని సితార కామెంట్లు చేశారు. మరి మెగా హీరోలతో కలిసి నటించే అవకాశం సితారకు ఎప్పుడు దక్కుతుందో చూడాల్సి ఉంది. 37 సంవత్సరాల నట జీవితంలో సితార 100 కంటే ఎక్కువ సినిమాలలో నటించారు. అయితే రాబోయే రోజుల్లో మరిన్ని గొప్ప పాత్రలు చేయాలని సితార భావిస్తుండటం గమనార్హం. సితారకు సరైన పాత్రలు దక్కడం లేదని ఆమె అభిమానులు భావిస్తున్నారు.
సాంబ, జోష్, బృందావనం, లెజెండ్, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, శతమానం భవతి, మరికొన్ని సినిమాలు సితారకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. సితార నటిగా ఆల్ రౌండర్ గా గుర్తింపు తెక్ఛుకున్నారు. సినిమాలకు ఈమె భారీగానే రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. సితార వచ్చిన ప్రతి పాత్రకు ఓకే చెప్పకుండా తనకు నచ్చే, నప్పే పాత్రలకు మాత్రమే ఓటేస్తున్నారు.