Sneha: ఒక్క పోస్టుతో విడాకుల రూమర్లకు చెక్ పెట్టిన నటి స్నేహ!

తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి హోమ్లీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి స్నేహ గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో పలు వార్తలు వస్తున్నాయి. ఈమె తన భర్త ప్రసన్న కుమార్ కి దూరంగా ఉంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు వల్ల ఈమె తన పిల్లలతో కలసి విడిగా ఉంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇలా వీరిద్దరు విడిగా ఉండడమే కాకుండా విడాకులు కూడా తీసుకోబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతున్నాయి.

ఈ విధంగా స్నేహ దంపతుల గురించి ఈ విధమైనటువంటి వార్తలు రావడంతో ఎంతో మంది అభిమానులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండి ఎందరికో ఆదర్శంగా ఉన్నటువంటి స్నేహ దంపతులు విడిపోవడం ఏంటి అని సందేహం వ్యక్తం చేశారు. స్నేహ దంపతులు విడిపోతున్నారనే వార్తలు రావడంతో ఈ వార్తలపై నటి స్నేహ స్పందించారు. తన గురించి వస్తున్నటువంటి విడాకులు వార్తలపై స్నేహ స్పందిస్తూ సోషల్ మీడియాలో తన భర్తతో కలిసి ఎంతో క్లోజ్ గా ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేశారు.

ఫోటో షేర్ చేయడమే కాకుండా ట్విన్నింగ్‌ అంటూ పోస్ట్ పెట్టింది. వీకెండ్‌ సందర్భంగా సరదాగా ఎంజాయ్‌ చేస్తున్నామనే అర్థం వచ్చేలా ఈమె పోస్ట్ చేయడంతో వీరి గురించి వచ్చే వార్తలకు చెక్ పెట్టినట్టు అయ్యింది. ఈ విధంగా ఒక్క ఫోటోతో స్నేహ విడాకుల వార్తలకు చెక్ పెట్టారు.

ఈ విధంగా విడాకుల వార్తల పై స్పందించి ఈమె సమాధానం చెప్పడంతో ఎలాంటి మనస్పర్ధలు లేవని ఇవన్నీ కేవలం ఒట్టి పుకార్లు మాత్రమేనని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం స్నేహ పలు సినిమాలలో కీలక పాత్రలలో నటించడమే కాకుండా మిస్టర్ మిస్సెస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus