జీవితంలో మొదటి సారి హాస్పిటల్ లో జాయినయ్యిందట..!

  • June 4, 2019 / 01:01 PM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన “లక్కీ” చిత్రంతో తెరంగేట్రం చేసింది. అయితే ఈమెకు అక్కడ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో టాలీవుడ్ కు అడుగుపెట్టింది. ప్రేమ కథా చిత్రాలకు కేర్ అఫ్ అడ్రెస్స్ అయిన కరుణాకరన్ డైరెక్షన్లో వచ్చిన ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయయ్యింది. ఆ చిత్రంలో ఈమె నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఈమె చూడటానికి జూనియర్ ఐశ్వర్య రాయ్ లా ఉంది అనే బిరుదు కూడా పొందింది.

తరువాత కూడా ‘నేను మీకు తెలుసా’ ‘కరెంట్’ ‘సింహా’ ‘అలా మొదలైంది’ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఈ అమ్మడికి ఆ చిత్రాలు పెద్దగా కలిసి రాలేదు. 2014 లో వచ్చిన ‘అంతా నీ మాయలోనే’ చిత్రం తర్వాత ఈమె ఇండస్ట్రీలో అడ్రెస్స్ లేదు. కానీ ట్విట్టర్‌లో మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. సడెన్ గా ఆమె హాస్పిటల్ బెడ్‌ పై ఉన్న ఫోటోలని పోస్ట్ చేసి తాను చికిత్స తీసుకుంటున్నట్టు తెలిపింది . తీవ్రమైన జ్వరం కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యిందట. స్నేహా మాట్లాడుతూ.. “జీవితంలో మొదటిసారి ఆస్పత్రిలో జాయిన్ అయ్యాను. హై ఫీవర్ వలన చికిత్స కోసం హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చింది. చాలా భయమేసింది. ఇప్పుడు ఆరోగ్యం కొంత మెరుగైంది. విశ్రాంతి ఎక్కువగా తీసుకోవడం వలన కొద్దిగా కోలుకున్నాను. ప్రస్తుతం మంచిగానే ఇంట్లో ఉన్నాను” అంటూ ట్వీట్లో పేర్కొంది ఈ భామ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus