7/జీ బృందావన కాలనీ సినిమా ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో సోనియా అగర్వాల్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగులో పరిమితంగా సినిమాలు చేసిన సోనియాకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. అయితే కన్నడ సోషల్ మీడియా తాజాగా సోనియా అగర్వాల్ పరువుకు భంగం కలిగేలా వ్యవహరించింది. ఒక హీరోయిన్ కు బదులుగా సోనియా అగర్వాల్ ఫోటోలను కొన్ని వెబ్ సైట్లు ప్రచురించాయి. డ్రగ్స్ కుంభకోణం కేసు కావడంతో ఆ వార్త తెగ వైరల్ కాగా ఈ విషయం సోనియా అగర్వాల్ దృష్టికి వచ్చింది.
ప్రస్తుతం సోనియా అగర్వాల్ గ్రాండ్ మా అనే తమిళ సినిమా షూటింగ్ నిమిత్తం కేరళలో ఉన్నారు. ఆమె దృష్టికి వచ్చిన వెంటనే తన గురించి తప్పుగా జరిగిన ప్రచారాన్ని ఆమె ఖండించారు. తన గురించి తప్పుగా రాసిన వెబ్ సైట్లు, జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించడం గమనార్హం. జర్నలిస్టులు సరైన హోమ్ వర్క్ చేయకుండా తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారని ఆమె చెప్పుకొచ్చారు. సోనియా అగర్వాల్ అనే నటి డ్రగ్స్ కేసులో చిక్కుకోగా 7/జీ బృందావన కాలనీ హీరోయిన్ పేరు కూడా సోనియా అగర్వాల్ కావడంతో కన్నడ మీడియాకు చెందిన కొంతమంది జర్నలిస్టులు పొరపాటు పడ్డారు.
సోనియా అగర్వాల్ తన గురించి తప్పుగా ప్రచారం చేసిన వాళ్ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. సోనియా అగర్వాల్ గురించి తప్పుగా వార్తలు ప్రచారం చేసిన వాళ్లపై ఆమె అభిమానులు సైతం మండిపడుతున్నారు.