పెళ్లిళ్ల పేరుతో మోసం చేస్తోన్న హీరోయిన్ శ్రుతి!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలువురిని మోసం చేస్తోన్న నటి శ్రుతి భాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ఆమె నటించింది ఒక్కటే సినిమా అయినప్పటికీ తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. లగ్జరీలకు అలవాటు పడ్డ ఆమె తన అందంతో పలువురిని మోసం చేస్తోంది. తమిళనాడులోని మైలాపూర్ కి చెందిన శ్రుతి ‘ఆడి పోనా ఆవడి’ అనే తమిళ సినిమాలో నటించింది. అయితే సినిమా సక్సెస్ కాకపోవడంతో ఆమెకి అవకాశాలు రాలేదు. దీంతో ఆమె చదువుకోవడానికి లండన్ కి వెళ్లింది. ఈలోగా ఆమె తల్లితండ్రులు శ్రుతికి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మాట్రిమోనీలో ఆమె ప్రొఫైల్ అప్డేట్ చేశారు.

జర్మనీలో ఐటీ కంపనీలో పని చేస్తోన్న కోవైకు చెందిన బాలమురుగన్ అనే వ్యక్తి శ్రుతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. శ్రుతితో పరిచయం పెంచుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు. అలా కొన్నిరోజులు గ‌డిచిపోయాయి. అయితే ఒకరోజు శ్రుతి ఫోన్ చేసి తన తండ్రికి ఆరోగ్యం బాలేదని, హాస్పిటల్ ఖర్చులకు డబ్బు కావాలని అడగడంతో బాల‌మురుగ‌న్ రూ.45 లక్షలను నటి శ్రుతికి ఇచ్చాడు. డబ్బు తీసుకున్న తరువాత శ్రుతి అతడికి దూరం కావడం మొదలుపెట్టింది. మోసాన్ని గ్రహించిన బాలమురుగన్‌ తల్లిదండ్రులు కోవై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసుల విచారణలో నటి శ్రుతి పెళ్లి పేరుతో చాలా మందిని మోసం చేసి.. లగ్జరీ జీవితాన్ని అనుభవిస్తోందని తెలుసుకున్నారు. నటి శ్రుతిని, ఆమె తల్లి చిత్రను, సహోదరుడు సుభాష్‌ను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. ఆ తరువాత బెయిల్ పై వచ్చిన శ్రుతి లండన్ కి వెళ్లింది. ఈమె చేసిన మోసానికి చెన్నైకి చెందిన అముదన్ కూడా బలయ్యాడు.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus