బాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ దాటివేసిన స్టార్ హీరోలు

  • February 26, 2020 / 07:12 PM IST

టాలీవుడ్ హీరోలు వంద కోట్లు అంటే అవలీలగా దాటేస్తున్నారు. ఓ మోస్తరు టాక్ వచ్చిన చిత్రాలు సైతం అవలీలగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటివేస్తున్నాయి. దీనితో టాలీవుడ్ టాప్ స్టార్స్ గా ఉన్న మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్నీల పారితోషకాలు సైతం చుక్కల్లో ఉంటున్నాయి. సినిమా బడ్జెట్ లో 30 నుండి 40 శాతం హీరో రెమ్యూనరేషన్ కే పోతుంది. ఇక టాలీవుడ్ లో ఇప్పటికే కొందరు హీరోలు తమ పారితోషకం 50కోట్లకు పెంచుకున్నారు.

1)ప్రభాస్: ఈ రేసులో మొదటి స్థానంలో ఉన్న హీరో ప్రభాస్. సాహో చిత్రానికి ఆయన 50కోట్లకు పైగా పారితోషికం అందుకున్నారు. అనుకున్న స్థాయిలో సినిమా ఆడినట్లైతే ఇది మరింత పెరిగేది. బాహుబలి రెండు సిరీస్ లకు కలిపి ఆయన 50కోట్ల వరకు పారితోషికం తీసుకున్నారు.

2)మహేష్: ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సూపర్ స్టార్ మహేష్. సరిలేరు నీకెవ్వరు చిత్రానికి ఆయన కూడా 50కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆయన నిర్మాణ భాగస్వామిగా కూడా ఉన్నారు. కాబట్టి ఆయనకు ఇంకా ఎక్కువే ముట్టి ఉంటుంది.

3)పవన్ కళ్యాణ్ : రెండేళ్ల విరామం తరువాత రీఎంట్రీ ఇచ్చిన పవన్ కమిట్ అయిన మూడు చిత్రాలకు 50 కోట్ల చొప్పున డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ తో పాటు దర్శకుడు క్రిష్ తో ఒక చిత్రం, హరీష్ శంకర్ తో మరొక చిత్రం ఒప్పుకున్నారు.

4) ఎన్టీఆర్: తాజాగా ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ వచ్చి చేరాడని తెలుస్తుంది. త్రివిక్రమ్ మూవీ కొరకు ఆయన 50కోట్ల వరకు పారితోషికం అందుకోనున్నారని వస్తున్న సమాచారం. ఆర్ ఆర్ ఆర్ తరువాత ఆయన నుండి వచ్చే చిత్రం కావడంతో ఈ మాత్రం పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సైతం సుముఖంగా ఉన్నారట. ఆర్ ఆర్ ఆర్ కొరకు కూడా ఆయన పారితోషకం భారీగా ఉంది.

5)అల్లు అర్జున్: ఇక అల వైకుంఠపురంలో విజయం తరువాత బన్నీ కూడా సుకుమార్ చిత్రం కొరకు 30-35 కోట్ల వరకు తీసుకునే అవకాశం కలదు.

6) రామ్ చరణ్ : ప్రస్తుతం సినిమాకు 25-28 వరకు తీసుకుంటున్న రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ విడుదల తరువాత50కోట్ల వరకు డిమాండ్ చేయవచ్చు.

7)బాలకృష్ణ: సీనియర్ హీరోలలో బాలకృష్ణ హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అయన సినిమాకు 12కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. వరుస పరాజయాల రీత్యా ఈయన రెమ్యూనరేషన్ తగ్గే అవకాశం కలదు.

8)వెంకటేష్ : వయసుకు తగ్గ పాత్రలు, మల్టీ స్టారర్ లు చేస్తూ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న వెంకటేష్ పారితోషికం కూడా 12కోట్ల వరకు ఉంది.

9)విజయ్ దేవరకొండ: అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న హీరో విజయ్ తక్కువ కాలంలో తన రెమ్యూనరేషన్ రెండు అంకెలకు పెంచుకున్నాడు. ఐతే ఈ మధ్య వరుస పరాజయాలు ఎదుర్కుంటున్న ఈ హీరో గ్రాఫ్ ఇలాగే కొనసాగితే పారితోషికం కిందకి పడిపోతుంది.

10)నాగార్జున: టాలీవుడ్ మరో సీనియర్ హీరో నవమన్మధుడు నాగార్జున సినిమాకు 7.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

ఇక మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత చేసిన రెండు సినిమాలు, సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో చేశారు. దీనితో ఆయన పారితోషికం పై స్పష్టత లేదు. ఆయన పారితోషికం భారీగా ఉన్నప్పటికీ, ఈ లిస్ట్ లో ఆయన్ని అందుకే చేర్చలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus