దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన యూత్ ఫుల్ ఎంటెర్టైనర్ ‘కేరింత’ అందరికీ గుర్తుండే ఉంటుంది. సాయి కిరణ్ అడివి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2015 లో విడుదలై డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీలో భావన అనే స్టూడెంట్ గా నటించిన సుకృతి(Sukrithi) అందరికీ గుర్తుండే ఉంటుంది. పార్వతీశంతో కలిసి ఆమె ఈ సినిమాలో చేసిన కామెడీకి థియేటర్లో ఆడియన్స్ అంతా ఎగబడి నవ్వుకున్నారు. ‘కేరింత’ తర్వాత సుకృతి బిజీ అయిపోతుంది అని అంతా అనుకున్నారు.
కానీ తర్వాత ఈమె ఎక్కువ సినిమాలు చేసింది లేదు. కనీసం మీడియా ముందుకు కూడా ఎక్కువగా వచ్చింది లేదు. కాబట్టి ఆమె సినిమాలకి ఎందుకు గుడ్ బై చెప్పింది అనేది ఇప్పటికీ ఓ మిస్టరీనే..! అయితే 2022 లో ఈమె పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది.అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని సుకృతి పెళ్లాడింది. అప్పటి నుండి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూనే వస్తోంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, భర్తతో కలిసున్న ఫోటోలు షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ తో టచ్లోనే ఉంటూ వస్తోంది.
సోషల్ మీడియాలో సుకృతికి 75K ఫాలోవర్స్ సంఖ్య ఉంది. ఇదిలా ఉండగా.. సుకృతి ఇప్పుడు ప్రెగ్నెంట్. ఇదివరకే ఈ విషయాన్ని ధృవీకరించింది. ఈమెకు నెలలు నిండుతున్నాయి. ఈమె లేటెస్ట్ బేబీ బంప్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె భర్త కూడా ఉండటాన్ని గమనించవచ్చు. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :