ఒక సినిమాకి సైన్ చేసే ముందు హీరోయిన్స్ కి కథ నచ్చాలి.. క్యారక్టర్ నచ్చాలి. మరికొంతమందికి రెమ్యునరేషన్ నచ్చాలి. ఇవి నచ్చకపోతే నో చెబుతారు. ఇక బికినీ, లిప్ లాక్స్ కి నో చెప్పేవారిని కూడా చూస్తుంటాం. తాజాగా రెండవ హీరోయిన్ అయితే చేయనని చెప్పే హీరోయిన్స్ కూడా ఉంటారని తెలిసింది. ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలో అమ్ము గా (Actress Surbhi) అందరి మనసు దోచుకున్న ఈ బ్యూటీ నాని జెంటిల్ మ్యాన్ సినిమాలోను మెప్పించింది. అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ లో ఒకరిగా కనిపించింది. ఇక రీసెంట్ గా “ఒక్క క్షణం” చిత్రంతో మంచి హిట్‌ని అందుకుంది. సో తమ సినిమాలో సురభి నటిస్తే బాగుంటుందని దర్శకనిర్మాతలు కోరుకుంటున్నారు.
ఆమెను అడిగితే మాత్రం నో చెబుతుందంట. ఇకపై మొదటి హీరోయిన్ లేదా సోలో హీరోయిన్ అయితేనే చేస్తానంటూ కండిషన్ పెట్టిందంట. ఈ రూల్ కారణంగానే నితిన్ కొత్త సినిమా “శ్రీనివాస కళ్యాణం” సినిమాని వదులుకుంది. దిల్ రాజు రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తానన్నా రెండో హీరోయిన్ గా అసలు చేయనని చెప్పిందంట. అలాగే రామ్ హీరోగా తెరకెక్కబోతున్న “హలో గురు ప్రేమ కోసమే” వంటి చిత్రాలలో సెకండ్ హీరోయిన్గా అవకాశం వచ్చినప్పటికీ చేయనని చెప్పేసినట్లుగా ఫిలిం నగర్ వాసులు చెప్పారు. స్టార్ హీరోయిన్స్ సైతం నేటి పోటీని తట్టుకోలేక తప్పుకుంటుంటే ఇటువంటి రూల్స్ తో సురభి ఇండస్ట్రీ కి దూరమయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.