సురేఖ వాణి (Surekha Vani) పై సోషల్ మీడియాలో ఏదో ఒక డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఆమె భర్త లేకున్నా, సినిమాల్లో ఛాన్సులు దక్కినా ఖరీదైన కారులో ఎలా తిరుగుతుంది. విలాసవంతమైన బంగ్లా ఎలా ఉంది అంటూ అనేక కామెంట్లు వినిపిస్తూనే ఉంటాయి. వీటిపైనే కాదు, డ్రగ్స్ కేసులో ఆమె పేరు ఉండటం పై కూడా తాజాగా ఆమె స్పందించి క్లారిటీ ఇచ్చింది. సురేఖ వాణి మాట్లాడుతూ.. “భర్త లేడు, సినిమాల్లో ఛాన్సులు లేవు, అయినా విలాసవంతమైన జీవితం గడపడంపై చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాను.
నిజంగా నాకు ఇప్పటికీ సొంత ఇల్లు లేడు. పాత బీఎమ్‌డబ్ల్యూ కారు అమ్మేసి సెకండ్ హ్యాండ్లో అదీ ఈఎమ్ఐ పద్దతిలో చెల్లించే విధంగా ఓ రేంజ్ రోవర్ కారు కొనుకున్నాము. ఇక డ్రగ్స్ కేసు. కేపీ చౌదరి మా అందరికీ కామన్ ఫ్రెండ్. మేము మామూలుగా పార్టీల్లో కలుస్తుంటాము. మా ఫోన్లో నా ఫోటోల కంటే వేరే ఆర్టిస్టుల ఫోటోలే ఎక్కువ ఉంటాయి.అలాగే అతని ఫోన్లో 300 మంది ఫోటోలు ఉంటే ముగ్గురి ఫోటోలు మాత్రమే బయటికొచ్చాయి. అందులో నా ఫోటో కూడా ఉండటం వల్ల అందరూ నానా రకాలుగా మాట్లాడుకుంటున్నారు.
అది నన్ను మానసికంగా చాలా కృంగదీసింది. నా కూతురితో చెప్పుకుని చాలా ఏడ్చాను. నెల రోజుల వరకు నేను ఏమీ తినలేకపోయాను. వాటి నుండి రిలీఫ్ అవ్వాలని అమెరికా ట్రిప్ కి వెళ్తే… ‘డ్రగ్స్ కేసు వల్ల నేను అమెరికా పారిపోయాను’ అని అన్నారు. ముఖ్యంగా ఓ ఛానల్ వారు నన్ను బాగా టార్గెట్ చేశారు. అయితే అమెరికా ట్రిప్ వల్లే నేను త్వరగా కోలుకోగలిగాను. రెండో పెళ్లి పై నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పటి రిలేషన్ షిప్స్ పై నమ్మకం లేదు” అంటూ చెప్పుకొచ్చింది.