నేటి హీరోయిన్లు హీరోలతో పోటీ పడుతున్నారు. నటనలో అనుకుంటే పొరబాటే. శరీరాన్ని ఫిట్ గా చేసుకోవడానికి గంటల తరబడి జిమ్ ల్లో గడుపుతున్నారు. నేటి సినీ అభిమానుల్లో వచ్చిన మార్పులు కారణంగా అమ్మాయిలు సుకుమారంగా కంటే ఫిట్ గా ఉండేందుకే ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. బాలీవుడ్ తారలు బిబాసాబసు, కరీనా కపూర్, ప్రియాంక చోప్రాలు తమ బాడీని అదుపులో పెట్టుకుని అవకాశాలను చేతిలో పెట్టుకున్నారు.
వారిని ఆదర్శంగా తీసుకుని టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఫిట్ బాడీ తో హాట్ గా కనిపించడానికి సై అంటున్నారు. నీలకంఠ “మాయ” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైనా బెంగళూర్ బ్యూటీ సుష్మ రాజ్ ఫిట్ మంత్రాన్ని జపిస్తోంది. నాయకి సినిమా ద్వారా గుర్తింపు సాధించిన ఈ భామ అవకాశాలను పట్టేందుకు ఫ్లాట్ స్టమక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం సుష్మ “వీడు గోల్డెహే” చిత్రంలో సునీల్ సరసన నటిస్తోంది. ఇందులో ఆమెది డేరింగ్, డాషింగ్ పాత్ర అని, అందుకే కష్టపడుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. “బాడీని ఫిట్ గా ఉంచుకుంటే అవకాశాలు వస్తాయో, రావో చెప్పలేను కానీ, మనలో కాన్ఫిడెంట్ మాత్రం బాగా పెరుగుతుంది” అని సుష్మ వెల్లడించింది. సుష్మ తాజా ఫోటోలు చూసిన వారందరూ టాప్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుందని చెబుతున్నారు.
#Mondaymotivation #girlswholift #getstrong #shootTime #abscheck #eedugoldehe
A photo posted by SushmaRaj (@sushma__raj) on
#sweat #hardwork #grow #believe happy weekend folks! ☺
A photo posted by SushmaRaj (@sushma__raj) on