బాలీవుడ్‌లో పెళ్లిళ్ల గురించి వెటకారంగా మాట్లాడి వైరల్ అయిన ప్రముఖ కథానాయిక తాప్సి (Taapsee Pannu) పెళ్లి వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఆమె పెళ్లి అయింది అనే పుకార్లు తప్ప ఎక్కడా కన్‌ఫర్మేషన్లు లేనప్పటికీ… ఇప్పుడు లీక్ అయిన వీడియో చూసి పెళ్లి అయింది అని అనుకుంటున్నారు నెటిజన్లు. అలా అని ఆ వీడియోలో పెళ్లి కనిపిస్తోందా అంటే అదేం లేదు. పెళ్లి వేడుక దగ్గర సన్నిహితుల మధ్యలో తాప్సి డ్యాన్స్ చేస్తుండటం మాత్రమే కనిపిస్తోంది. ఆ వీడియోను అభిమానులు, షేర్ చేస్తున్నారు అంతే.
తాప్సీ పెళ్లి అయింది కానీ.. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, సమాచారం ఇలా ఏదీ ఇప్పటివరకు అఫీషియల్‌గా బయటకు రాలేదు. మార్చి 23న ఉదయ్ పూర్‌లో తాప్సీ, తన ప్రియుడు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోను పెళ్లాడింది అని సమాచారం. ఈ వేడుకలో ఆమె సరదాగా డ్యాన్స్ చేసిన వీడియోనే ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో ఆమె ఎంతో ఉత్సాహంగా కనిపించింది.
ఎరుపు రంగు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తాప్సీ.. కళ్లకి కూలింగ్ గ్లాస్‌లు పెట్టుకుని.. డాన్స్ చేస్తూ పెళ్లి పందిరిలోకి వస్తూ కనిపించింది. వరుడు మథియాస్ బో ఆమెకు ఎదురు వెళ్లి స్వాగతం పలికడం ఆ వీడియోలో చూడొచ్చు. 2013 నుండి తాప్సీ మథియాస్ బో రిలేషన్‌లో ఉంది. దాదాపు పదేళ్లు వీరి ప్రేమ బంధం కొనసాగుతుంది. మార్చి 23న పెళ్లి చేసుకున్నారు అని అంటున్నారు.
డెన్మార్క్ దేశానికి చెందిన మథియాస్ 2012 ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించాడు. 2020లో ఆటకు మథియాస్ రిటైర్మెంట్ ప్రకటించాడు. 43 ఏళ్ల మథియస్ ఇప్పుడు ప్రస్తుతం కోచ్‍గా ఉన్నాడు. ఆ ఇద్దరూ ప్రైవేట్‍గా ఉండేందుకు ఇష్టపడతారని, అందుకే ఇలా పెళ్లి చేసుకున్నారు సన్నిహితులు చెబుతున్నారు. అయితే పెళ్లి అయిపోయింది అని చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇతరుల మీద కామెంట్లు చేసే తాప్సి… ఇలా ఎందుకు చేసిందో ఆమెకే తెలియాలి.