శ్రీ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా హ్యాపీ డేస్ సినిమాతో తనలో మంచి నటి ఉందని ప్రూవ్ చేసుకున్నారు. కొన్ని నెలల క్రితం కరోనా బారిన పడిన తమన్నా త్వరగానే వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత సాధారణ మనిషిని కావడానికి రెండు నెలల సమయం పట్టిందని మిల్కీ బ్యూటీ చెబుతున్నారు. మరోవైపు సెలబ్రిటీలపై విమర్శలు చేస్తున్న వారిపై తమన్నా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
సెలబ్రిటీలు తమ స్థాయిలో సహాయం చేస్తూనే ఉన్నారని తమన్నా పేర్కొన్నారు. ఏది నిజంగా అవసరమో అది తమ వంతుగా ఇస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు. తాను తన వంతు సహాయం చేస్తున్నా ఆ సహాయాన్ని చెప్పుకోనని తమన్నా అన్నారు. మరి కొందరికి స్పూర్తిని ఇవ్వాలనే ఉద్దేశంతో కొంతమంది చేసిన సహాయం చెప్పుకుంటారని తమన్నా తెలిపారు. సహాయం చేసి సైలెంట్ గా ఉన్న సెలబ్రిటీలను తప్పుబట్టడం సరికాదని తమన్నా పేర్కొన్నారు. తనకు పరిచయం ఉన్న సెలబ్రిటీలలో చాలామంది కరోనా బాధితులకు సహాయం చేస్తున్నారని తమన్నా అన్నారు.
సెలబ్రిటీలపై ప్రెజర్ ఉంటుందని బయటకు చెప్పుకోవడాన్ని ఇష్టపడని తనలాంటి సెలబ్రిటీలు చాలామంది ఉంటారని తమన్నా తెలిపారు. చాలామంది సెలబ్రిటీల దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయని అనుకుంటారని అలా అనుకోవడం సరి కాదని తమన్నా వెల్లడించారు. సహాయం చేయడం కోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గం ఎంచుకుంటారని వాళ్లను ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని తమన్నా తెలిపారు.
Most Recommended Video
ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!