బెంగళూరులో నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన తమన్నా!

ఎంతటి స్టార్ హీరో, హీరోయిన్ అయినప్పటికీ వారు కూడా సామాన్యుల మాదిరిగా ఆలోచిస్తారు. వారికి సమాజం బాగుండాలని ఉంటుంది. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంటారు. అందుకే ప్రకృతి విపత్తుల సమయంలో సాయం చేయడానికి ముందు ఉంటారు. తమ దృష్టికి వచ్చిన సమస్యని పరిష్కరించడానికి, సంబంధిత అధికారులను ప్రశ్నించడానికి సమయాన్ని కేటాయిస్తుంటారు. తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నాకి ఓ నిర్లక్ష్యం ఆగ్రహాన్ని తెప్పించింది. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని ఇందిరానగర్‌లో ఆదివారం ఓ ఆయుర్వేదిక్ థెరపీ సెంటర్‌‌ ప్రారంభోత్సవానికి తమన్నా వెళ్లింది. అక్కడ ఎలక్ట్రిసిటీ జంక్షన్ బాక్స్ నుంచి విద్యుత్ తీగలు వేలాడుతుండటాన్ని చూసి షాకయింది.

ప్రమాదకరమైన విద్యుత్ వైర్లు ఉన్న బాక్స్‌ను అలా నిర్లక్ష్యంగా తెరిచి ఉండటాన్ని తమన్నా తట్టుకోలేకపోయింది. తనను చూడటానికి ఫ్యాన్స్ వచ్చిన సమయంలో ఏమైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని తమన్నా అధికారులను ప్రశ్నించింది. దానిని బాగుచేయాల్సిందిగా కోరింది. ప్రస్తుతం తమన్నా బాలీవుడ్ మూవీ క్వీన్ రీమేక్ “ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి”లో న‌టిస్తోంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి “సైరా న‌ర‌సింహారెడ్డి”లో కీల‌క పాత్ర పోషిస్తోంది. అనిల్ రావి పూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న F2 లోను విక్టరీ వెంకటేష్ కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలు విజయవంతమైతే మరిన్ని అవకాశాలు అందుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus