Trisha: 20 ఏళ్ళ సినీ కెరీర్లో త్రిష రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!

ఈరోజు స్టార్ హీరోయిన్ త్రిష పుట్టిన రోజు. 1983 వ సంవత్సరం మే 4న ఆమె చెన్నైలో జన్మించింది. 1999 మిస్ చెన్నై పోటీలో టైటిల్ విన్నర్ గా నిలిచిన ఆమె మొదట తరుణ్ హీరోగా తెరకెక్కిన ద్విభాషా చిత్రం ‘ఎనక్కు 20 ఉనక్కు 18’ … తెలుగులో ‘నీ మనసు నాకు తెలుసు’ పేరుతో డబ్ అయ్యింది. ఆ తర్వాత ప్రభాస్ ‘వర్షం’ సినిమాలో నటించి స్టార్ డంని సంపాదించుకుంది. ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ ‘అతడు’ ‘స్టాలిన్’ వంటి చిత్రాల్లో నటించి తన క్రేజ్ ను పెంచుకుంది. 20 ఏళ్లుగా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది త్రిష.

ఈ మధ్యనే ‘పొన్నియన్ సెల్వన్-2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నప్పటికీ త్రిష ఇంకా పెళ్లి గురించి ఆలోచించడం లేదు. గతంలో ఓ బిజినెస్ మెన్ తో నిశ్చితార్థం చేసుకున్న త్రిష.. పెళ్లి పీటలు ఎక్కలేదు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. తన 20 ఏళ్ళ సినీ కెరీర్లో త్రిష కొన్ని.. సినిమాలను రిజెక్ట్ చేసింది. కథలు నచ్చక కొన్ని.. కాల్ షీట్లు సర్దుబాటు చేయలేక మరికొన్ని సినిమాలను త్రిష రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ‘కన్మణి రాంబో ఖతీజా'(కె.ఆర్.కె) :

నయనతార భర్త విగ్నేష్ శివన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నయన్ ప్లేస్ లో మొదట త్రిషని అనుకున్నాడు విగ్నేష్. కానీ ఆమె ఈ ఆఫర్ ను వద్దనుకుంది. దీంతో నయన్ ను ఫైనల్ చేశాడు. ‘కాతు వాకుల రెండు కాదల్’ అనే టైటిల్ తో తమిళంలో రూపొందింది ఈ చిత్రం. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.

2) ఆచార్య :

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసుకున్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది.

3) బాలయ్య 108 :

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తున్న మూవీలో మొదట త్రిషని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో కాజల్ ను ఫైనల్ చేశారు.

4) సామి 2 :

హరి దర్శకత్వంలో రూపొందిన ‘సామి’ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. కానీ ‘సామి 2’ కి ఆమె నో చెప్పింది.

5) బాయ్స్ :

శంకర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ సరసన త్రిష హీరోయిన్ గా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల జెనీలియాని ఫైనల్ చేశారు.

6) ఆడుకలం :

ధనుష్ – వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా మొదట త్రిషని అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో తాప్సిని ఫైనల్ చేశారు.

7) రామయా వస్తావయా(హిందీ) :

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ హిందీ రీమేక్ లో కూడా మొదట హీరోయిన్ గా త్రిషని సంప్రదించాడు దర్శకుడు ప్రభుదేవా. కానీ ఆమె కాల్ షీట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో శృతి హాసన్ ను ఫైనల్ చేశాడు.

8) జాను :

దిల్ రాజు నిర్మాణంలో ’96’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గా మొదట త్రిషని సంప్రదించారు. ఒరిజినల్ లో కూడా ఆమెనే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. కానీ త్రిష నో చెప్పడంతో సమంతని ఫైనల్ చేశారు.

9) భైరవ(తమిళ్) :

విజయ్ హీరోగా రూపొందిన ఈ మూవీలో మొదట త్రిషని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తర్వాత కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు అనుకోండి..!

10) గోపాల గోపాల :

‘ఓ మై గాడ్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా మొదట (Trisha) త్రిషని అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో శ్రీయని ఫైనల్ చేశారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus