వనిత విజయ్ కుమార్ ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారు నేడు ఆమె విఎఫ్ఎక్స్ డైరెక్టర్ పీటర్ పాల్ ని వివాహం చేసుకున్నారు. పీటర్ పాల్ మరియు వనిత ల వివాహం క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగింది.కరోనానేపథ్యంలో పరిమిత బంధువులు మరియు స్నేహితులు ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక ఈ వివాహం గురించి ఎప్పుడో వనిత బయటపెట్టిన సంగతి తెలిసిందే. కాగా వీరిద్దరి వివాహానికి సంబంధందించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు.
దీనితో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వనిత వ్యక్తిగత జీవితం అనేక వివాదాల మయం. ఈమె 2000 సంవత్సరంలో టీవీ నటుడు ఆకాష్ ని వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన కొన్నేళ్ళకు వీరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికి ఒక కొడుకు ఉన్నాడు. తను తండ్రి సంరక్షణలో పెరుగుతున్నాడు.ఆతరువాత 2007లో పారిశ్రామిక వేత్త అయిన.. ఆనంద్ జె రాజన్ తో వివాహం జరిగింది.

ఐదేళ్ల తర్వాత ఆయనతో 2012 లో విడిపోయింది. వీరికి ఓ పాప పుట్టగా, రాజన్ దగ్గర పెరుగుతుంది. ఎనిమిదేళ్ల తర్వాత వనిత పీటర్ పాల్ ని నేడు మూడో వివాహం చేసుకుంది.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video
కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే
