డాషింగ్ డైరెక్టర్ పూరీ జన్నాథ్, యూత్ స్టార్ నితిన్ కాంబినేషన్లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది అదాశర్మ. మొదటి చిత్రంతో ఆకట్టుకుంది.. మంచి గ్లామర్ కూడా ఆమె సొంతం.. కానీ ఈమెకు అవకాశాలు మాత్రం కరువయ్యాయి. ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘క్షణం’ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా వస్తున్న ‘కల్కి’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉండగా ఈమె…సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ యమ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే.
ప్రస్తుతం అదా ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం రెడీ అవుతుంది. ‘ది హాలిడే’ అనే పేరుతో రూపొందే ఈ సిరీస్ కోసం అదాశర్మ సరికొత్త హెయిర్ స్టైల్ ను ట్రై చేస్తుంది. ఈ క్రమంలో తన జుట్టుకి మూడు రకాల రంగులతో డై వేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ హెయిర్ స్టైల్ అదా కు మంచి క్రేజ్ తీసుకొచ్చింది. దీంతో ‘ఈ హెయిర్ స్టైల్ కాపీ రైట్స్ నావే’ అంటూ ట్వీట్ చేసింది. ” ‘ది హాలిడే’ వెబ్ సిరీస్ కోసం చేసుకున్న హెయిర్ స్టైల్ అని, అమ్మాయిలూ దీన్ని ట్రై చేయకూడదు..! ఈ హెయిర్ స్టైల్ పై పూర్తి కాపీ రైట్స్ నావే” అంటూ వార్నింగ్ ఇచ్చేస్తుంది. ఈ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. అయితే ‘వెబ్ సిరీస్’ కి కూడా ఇంత హడావిడి అవసరమా.. ఇలా అయినా క్లిక్ అవుతుందా’ అనే కామెంట్స్ కూడా పెడుతున్నారు నెటిజన్లు..!