మొత్తానికి ‘జబర్దస్త్’ విషయంలో అభి..!

  • November 21, 2019 / 06:33 PM IST

గత కొద్ది రోజులుగా ‘జబర్దస్త్’ షోకి సంబందించిన రక రకాల రూమర్స్ వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో నుండీ హైపర్ ఆది, అనసూయ, నాగబాబు ఇంకా పలువురు పాపులర్ కమెడియన్స్ ఈ షో నుండీ మరో షోకి మారుతున్నారు.. కాబట్టి ఈ షో కి ఆదరణ తగ్గ్గిపోయే ప్రమాదం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాల పై ఎటువంటి క్లారిటీ రాలేదు. కానీ ‘జబర్దస్త్’ పాపులర్ కమెడియన్ అయిన అదిరే అభి జబర్దస్త్ వస్తున్న రూమర్స్ ను ఖండిస్తూ అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు.

అదిరే అభి మాట్లాడుతూ… ” ‘జబర్దస్త్’ షో పై వస్తున్న వార్తల్లో నిజం లేదు. హైపర్ ఆది షో నుండీ వెళ్ళిపోతున్నాడు అనేది రూమర్ మాత్రమే. నాకు తమ్ముడు లాంటివాడు ఆది.. తను ‘జబర్దస్త్’ని వదిలి వెళ్ళడం లేదు.’మల్లెమాల సంస్థ’ మాకు అన్నం పెట్టింది.. దాన్ని వదిలి వెళ్ళము. అలానే యాంకర్ అనసూయ షోని వదిలేస్తుందనే విషయంలో కూడా నిజం లేదు. ఆమె కూడా షోలో కొనసాగుతారు. కానీ నాగబాబు గారి విషయంలో నేను క్లారిటీ ఇవ్వలేను. నాది అంత స్థాయి కాదు.. ఆయన బయటకి వెళ్ళారంటే అది ఆయనకి సంబంధించిన విషయం. ‘జబర్దస్త్’ అనేది ఫ్యామిలీ లాంటిది. ఫ్యామిలీలో చిన్న చిన్న మనస్పర్ధలు వస్తుంటాయి.. ఎవరు ఎక్కడ ఉన్నా.. ఫ్యామిలీ అంతా ఒక్కటే. ఒకరిద్దరు షో నుండి బయటకి వెళ్ళినంత మాత్రాన షో ఆగిపోదు. మునుపటిలానే ప్రేక్షకులను అలరిస్తూ అదే టీఆర్పీ తీసుకొస్తుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus