ఈమధ్యకాలంలో మంచి సినిమాలు జనం చూడడం లేదని మన డైరెక్టర్స్ ఫిక్స్ అయిపోయారో లేక కలెక్షన్స్ కూడా ఆ తరహా సినిమాలకే బాగుంటున్నాయి కదా అని ఫిక్స్ అయ్యారో తెలియదు కానీ.. అడల్ట్ కంటెంట్ సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి తెగ ఆసక్తి చూపుతున్నారు మన తెలుగు దర్శకనిర్మాతలు. తమిళంలో అడల్ట్ సెక్స్ హారర్ కామెడీగా రూపొందిన “ఇరట్టు అరాయిల్ మురట్టు కుత్తు” అనే చిత్రం అక్కడ సెన్సేషనల్ హిట్ అయ్యింది. కేవలం సినిమాలో హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ మరియు డబుల్ మీనింగ్ డైలాగ్స్ వల్లే సినిమా అంత పెద్ద హిట్ అయ్యింది.
దాంతో ఆ సినిమాను రీమేక్ చేయాలని తమిళ వెర్షన్ విడుదల సమయంలో మారుతి ప్లాన్ చేశాడు కానీ.. వర్కవుట్ అవ్వలేదు. అయితే.. తమిళ వెర్షన్ ను డైరెక్టర్ చేసిన సంతోష్ కుమార్ తెలుగు వెర్షన్ ను తెరకెక్కించాడు. ఆ చిత్రానికి “చీకటి గదిలో చితక్కొట్టుడు” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ తోనే ఆడియన్స్ ను బాగా ఎట్రాక్ట్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ ఇవాళ విడుదలైంది. తమిళ వెర్షన్ కంటే ఓ పదిరేట్లు ఎక్కువగానే సెక్స్ క్వాంటీటీ ఉన్నట్లు తెలుస్తోంది ట్రైలర్ తో. త్వరలోనే విడుదలకానున్న ఈ చిత్రంలో అరుణ్ ఆదిత్, ఆర్జే హేమంత్ హీరోలుగా నటిస్తున్నారు. మరి తమిళనాట కుర్రకారును వేడెక్కించినట్లుగా.. తెలుగులోనూ విజయం సాధిస్తుందో లేదో చూడాలి.