Aditi Shankar: స్టార్ డైరెక్టర్ కూతురు నటిగా బిజీ అవుతోంది!

  • August 4, 2022 / 12:56 PM IST

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. తండ్రిలాగా మెగాఫోన్ పడుతుందనుకుంటే నటిగా తన సత్తా చాటాలనుకుంటోంది. కార్తీ నటిస్తోన్న ‘విరుమాన్’ సినిమాతో అదితి శంకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. ఆగస్టు 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో నటించడంతో పాటు ఓ పాట కూడా పాడింది అదితి. ఈ సినిమా రిలీజ్ కాకుండానే ఆమెకి మరో సినిమా ఆఫర్ వచ్చింది.

కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా ‘మావీరన్’. మడోన్ అశ్విన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఓ బైలింగ్యువల్ ప్రాజెక్ట్. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి ‘మహావీరుడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా అదితి శంకర్ ను ఎంపిక చేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాతో అదితి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించబోతుంది.

ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శాంతి టాకీస్‌ సమర్పణలో అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివకార్తికేయన్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన చిన్న వీడియోను మహేష్ బాబు విడుదల చేశారు. అందులో హీరో రస్టిక్ అవతార్ లో కనిపించారు. సినిమాను కూడా ఇంట్రెస్టింగ్ ప్లాట్ తో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు మడోన్ అశ్విన్ ఇదివరకు ‘మండేలా’ అనే సినిమా తీశారు.

యోగిబాబు లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాకి ఇటీవల నేషనల్ అవార్డు దక్కింది. చిన్న పాయింట్ తో ‘మండేలా’ సినిమాను ఎంటర్టైనింగ్ గా, సందేశాత్మకంగా చిత్రీకరించారు. ఇప్పుడు శివ కార్తికేయన్ సినిమా మరో రేంజ్ లో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సివున్నాయి!

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus