Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » ఇంటర్వ్యూ : ‘హిట్2’ గురించి అడివి శేష్ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు..!

ఇంటర్వ్యూ : ‘హిట్2’ గురించి అడివి శేష్ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు..!

  • December 2, 2022 / 01:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇంటర్వ్యూ : ‘హిట్2’ గురించి అడివి శేష్ చెప్పిన ఆసక్తికరమైన విషయాలు..!

‘వాల్‌ పోస్టర్‌ సినిమా’ బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని, నాని ల నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హిట్ 2’. ‘హిట్’ మూవీ ఎంత సక్సెస్ అయ్యిందో అందరికీ తెలుసు. దానికి ఫ్రాంచైజీగా ‘హిట్ ‌2 ద సెకండ్ కేస్‌’ రూపొందింది. వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ హీరో కావడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.టీజర్, ట్రైలర్ లతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ డిసెంబర్ 2న విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు.

ప్ర. రేపే సినిమా రిలీజ్? ఎలా ఉంది? టెన్షన్ గా ఉందా? ఎక్సయిట్మెంట్ గా ఉందా?

అడివి శేష్ : టెన్షన్ గానే ఉంది. 2 ఏళ్ళు కష్టపడి చేశాం. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? అనేది ఉంటుంది కదా.

ప్ర. ‘హిట్ 2’ నటిస్తున్నప్పుడు విశ్వక్ సేన్ ను ఏమైనా కలిశారా?

అడివి శేష్ : లేదు. మేకింగ్ లో ఉండగా తప్ప.. అతనితో షూటింగ్ కు ముందు మాట్లాడింది లేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రమ్మని నేనే ఫోన్ చేశాను.అయితే అంతకు ముందే శైలేష్, నాని ఫోన్ చేసి చెప్పారు అని చెప్పాడు.

ప్ర. ‘హిట్ 2’ చేయడానికి.. ఈ కథలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏది?

అడివి శేష్ : ఇలాంటి సినిమాలు కిల్లర్ ఎవరు అని తెలుసుకోవడానికి ఆసక్తితో చూస్తారు. కానీ ఆ కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు అనే రీజన్ తెలుసుకుని ఓకే చేశాను.

ప్ర. ‘హిట్2’ లో మీరు ఎలా ఎంటర్ అయ్యారు?

అడివి శేష్ : నేనేమీ ఎంటర్ అవ్వలేదు. నాని, శైలేష్ గారు వాళ్ళ ప్రాజెక్ట్ లోకి నన్ను ఆహ్వానించారు.

ప్ర. ‘హిట్ 2’ ట్విస్ట్ ఇదేనని.. హీరోయిన్ విలన్ అని రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి?

అడివి శేష్ : అందులో నిజం లేదు. హీరోయిన్ మా సినిమాలో చాలా ఇంపార్టెంట్. కానీ రొటీన్ హీరోయిన్ లా కనబడదు. అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నవి మాత్రం అబద్దం.

ప్ర. హిట్ 3 లో కూడా మీరు ఉన్నారు అని చెప్పారు?

అడివి శేష్ : అవును.. హిట్ 3 లో కూడా నేను ఉన్నాను. అయితే హిట్ 3 లో మెయిన్ హీరో ఎవరు అన్నది హిట్2 లో రివీల్ అవుతుంది.

ప్ర. హిట్ కేస్ లు ఇంకా ఎన్ని ఉంటాయి?

అడివి శేష్ : మొత్తం 7 కేసులు ఉంటాయి. 7వ కేసును అందరి హీరోలు కలిసి సాల్వ్ చేస్తారు. అది చాలా బిగ్ ప్రాజెక్ట్ అవుతుంది.

ప్ర. హిట్2 కథ పై మీకు ఎంత వరకు కాన్ఫిడెన్స్ ఉంది?

అడివి శేష్ : నాకు చాలా అనుమానాలు వస్తూనే ఉంటాయి. నేను ప్రతీది అనుమానంతోనే ఆలోచిస్తాను.. చూస్తాను.. కథలో అయితే ఇంకా ఎక్కువ అనుమానాలు వస్తుంటాయి.. అందుకే నేను ఎక్కువగా డౌట్స్ అడుగుతుంటాను.. అవి సరైన డౌట్సే అనుకుంట..! అందుకే నేను ఈ స్థాయిలో ఉండుంటాను.

ప్ర.ప్రతిసారి క్రైమ్, థ్రిల్లర్ సినిమాలు చేయడం ఎలా అనిపిస్తుంది? భవిష్యత్తులో జోనర్ ఏమైనా మార్చే అవకాశం ఉందా?

అడివి శేష్ : నేను చేసిన ‘మేజర్’ వీటికి భిన్నంగానే ఉంటుంది. అందులో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ లో పట్టు ఉంది. మిగిలిన వాటిలో కాన్ఫిడెన్స్ వచ్చాక చేస్తాను.

ప్ర.’హిట్ 2′ పాన్ ఇండియా రిలీజ్ అన్నారు కదా?

అడివి శేష్ : అవును.. మిగిలిన భాషల్లో డిసెంబర్ 30 కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.

ప్ర.హీరోస్ హీరో అయిపోయినట్టు ఉన్నారు.మహేష్, నాని ఇప్పుడు నాగార్జున వంటి హీరోల బ్యానర్లలో చేయడం ఎలా అనిపిస్తుంది.

అడివి శేష్ : చాలా ఆనందంగా ఫీలవుతున్నాను. నేను యూఎస్ లో ఉన్నప్పుడు 45 నిమిషాలు జర్నీ చేసి నాగ్ సర్, మహేష్ సర్(మురారి) మూవీస్ చూసేవాడిని. నాకు నాగ్ సర్ నటించిన ‘హలో బ్రదర్’ మూవీ చాలా ఇష్టం.

ప్ర. ‘హిట్2’ కి ఆల్ ది బెస్ట్..!

అడివి శేష్ : థాంక్యూ సో మచ్ అండీ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Hit 2
  • #Meenakshi
  • #Rao Ramesh
  • #Sailesh Kolanu

Also Read

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

Korean Kanakaraju First Review: వరుణ్ తేజ్ కి.. ఈసారైనా హిట్టు పడిందా?

related news

trending news

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

Pradeep Rawat: ప్రదీప్ రావత్ కి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా?

9 mins ago
Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

Top Hero: ‘ఆమె’ దెబ్బకి బలైన ‘టాప్ హీరో’

3 hours ago
Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

Ramayana: ‘రామాయ‌ణ’ కి ఆ నెగిటివిటీ కలిసొస్తుందా?

3 hours ago
Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

Korean Kanakaraju: రూ.38 కోట్లకి అప్పుడే రూ.26 కోట్లు… ‘కనకరాజు’ కనకవర్షం కురిపించే ఛాన్స్ ఉందా?

6 hours ago
Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

Pradeep Rawat: ఇండస్ట్రీలో తీవ్ర విషాదం… ప్రదీప్ రావత్ మృతి

20 hours ago

latest news

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

Dil Raju: హీరోకు ఎంతిస్తున్నామో చెప్పలేం.. కానీ ఆ మాటలు నమ్మొద్దు: దిల్‌ రాజు

2 hours ago
Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

Vismaya Mohanlal: సినిమాల్లోకి కొడుకు వచ్చీ వెళ్తున్నాడు.. ఇప్పుడు కూతురు వచ్చింది

3 hours ago
Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

4 hours ago
Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

Jailer 2: కేమియోలతో నింపేస్తున్నారుగా.. ఈసారి మొత్తం ఎనిమిది మంది వస్తారట

5 hours ago
Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version