G2: ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2
- September 17, 2026 / 04:59 PM ISTByFilmy Focus Desk
సుమారు ఎనిమిదేళ్ల క్రితం అనౌన్స్ అయిన సీక్వెల్ అ సినిమా. మూడేళ్ల క్రితం షూటింగ్ ప్రారంభించుకున్న ప్రాజెక్ట్ ఆ సినిమా.. మొదటి రిలీజ్ డేట్ చెప్పి నాలుగు నెలలు అయిపోయిన సినిమా ఇది. ఇదేంటి ఇంత పెద్ద ఇంట్రడక్షన్ ఉంది.. ఏంటా సినిమా అనుకుంటున్నారా? ఇంకేంటి అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘జీ 2’ సినిమా గురించే. ‘గూఢచారి’ సినిమాకు సీక్వెల్‌గా అనౌన్స్ అయిన ఈ సినిమా గురించే మేం చెబుతున్నది.
G2
అడివి శేష్ కథానాయకుడిగా, వామికా గబ్బి హీరోయిన్‌గా నటిస్తున్న ‘జి2’ సినిమాకు కొత్త రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వినయ్‌కుమార్ సిరిగినీడి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
పైన చెప్పినట్లు ఈ సినిమాను ‘గూఢచారి’ సినిమా ఎండింగ్‌లో అనౌన్స్ చేశారు. అంటే అది 2018లో జరిగింది. అక్కడికి ఐదేళ్ల తర్వాత జనవరి 9, 2023న ‘జి 2’ పేరుతో ఫస్ట్ లుక్ విడుదల చేసి.. సినిమా కాస్ట్ అండ్ క్రూ గురించి చెప్పారు. అప్పట్లో సినిమాలో బనితా సంధు హీరోయిన్ అని చెప్పారు. కొంత మేర షూటింగ్ అయిపోయాక ఆమెను పక్కన పెట్టారు. ఆమే తప్పుకున్నారు అని అంటారు. ఇందులో ఏది కరెక్టో వారికే తెలియాలి.
ఆమె సినిమాలో భాగం కాదు అని తేలాక అప్పటికి వైరల్ హీరోయిన్ అయిన వామికా గబ్బిని ఈ సినిమాలోకి తీసుకున్నారు. ఆ సమయంలో సినిమాను మే 1, 2026న విడుదల చేస్తామని చెప్పారు. కానీ సినిమా ఆ టైమ్‌కి కూడా రాలేదు. ఇప్పుడు కొత్తగా ఫిబ్రవరి 5, 2027 అంటున్నారు. ఈసారి మాట నిలబెట్టుకునేలానే ఉన్నారు. ఇంతకీ లేట్‌కి కారణమేమై ఉంటుంది అనేగా డౌట్. విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ సీన్స్ అంటున్నారు కానీ.. కథలో కూడా కొన్ని మార్పులు చేశారని సమాచారం.











