Adivi Sesh: శేష్ మార్కెట్ ను ఆ సినిమా డిసైడ్ చేస్తుందా?

Advertisement

అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమా సూపర్ హిట్ అయింది. దేశవ్యాప్తంగా ఈ సినిమా రూ.50 కోట్ల మార్క్ ను దాటుకొని స్టడీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. పవన్ కళ్యాణ్, చిరంజీవి లాంటి స్టార్స్ కూడా ‘మేజర్’ టీమ్ ను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు. రిలీజ్ కు ముందు చేసిన ప్రమోషన్స్, ప్రీరిలీజ్ స్క్రీనింగ్ అన్నీ కూడా సినిమాకి మంచి ఫలితాన్ని తీసుకురావడంలో దోహదపడ్డాయి. ‘విక్రమ్’ సినిమా ప్రభావం వలన కలెక్షన్స్ లో డ్రాప్ ఉంది కానీ మరీ చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే కాదు.

మొత్తానికి గానే అడివి శేష్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది ‘మేజర్’ సినిమా. ఈ సినిమా కోసం అడివి శేష్, దర్శకుడు శశికిరణ్ తిక్క ఎంత కష్టపడినా.. నిర్మాత మహేష్ బాబు ప్రోత్సాహం, అతడి బ్రాండ్ వేల్యూ ‘మేజర్’ సినిమాకి చాలా ఉపయోగపడ్డాయి. ఆయన ప్రమోషన్స్ లో పాల్గొని.. ‘మేజర్’ సినిమా గురించి గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు అడివి శేష్ ఇమేజ్ ఏ రేంజ్ లో పెరిగింది..? మార్కెట్ ఆయనను ఎలా చూస్తుందనే విషయాలు ‘హిట్2’ సినిమా రిలీజ్ అప్పుడు బయటపడుతుంది.

జూలై 29న విడుదల కానున్న ఈ సినిమాపై ఇప్పటికీ పెద్దగా అంచనాలు లేవు కానీ.. ‘హిట్’ సక్సెస్ అవ్వడంతో దానికి సీక్వెల్ గా వస్తోన్న సినిమా అని బజ్ అయితే క్రియేట్ అయింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే వచ్చింది. ఇంకా సమయం ఉంది కాబట్టి పబ్లిసిటీ మొదలుపెట్టలేదు.

ఇప్పుడు ‘మేజర్’ ఫలితాన్ని ఆధారంగా చేసుకొని ‘హిట్ 2’ సినిమాకి ఎంత థియేట్రికల్ బిజినెస్ జరుగుతుంది..? ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి. ‘మేజర్’ సినిమా నార్త్ ఆడియన్స్ కి కూడా రీచ్ అయింది కాబట్టి ‘హిట్2’ని కూడా పాన్ ఇండియా రిలీజ్ చేస్తారేమో చూడాలి!

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus