అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!

లైఫ్ లో ప్రతి ఒక్కరికీ ఓ సెలబ్రిటీ పై క్రష్ ఉంటుంది. ఇది రాస్తున్న నాతో పాటు.. చదువుతున్న మీకు కూడా ఎవరో ఒకరి పై క్రష్ ఫీలింగ్ ఉండే ఉంటుంది. మనకి కాబోయే వరుడు/వధువు పలానా హీరో/హీరోయిన్ లా ఉండాలి అని కలలుగంటూ ఉంటాం కదా..! దానినే క్రష్ ఫీలింగ్ అంటూ ఉంటారు. మనకి లానే కొంతమంది సెలబ్రిటీలకు క్రష్ ఫీలింగ్స్ ఉండేవి. మనమైతే ఏం చేస్తాం.. జస్ట్ మన క్రష్ అయిన సెలబ్రిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటాం, వాళ్ళ గ్లామర్ ఫోటోలు ఎక్కువగా చూస్తాము.

కానీ ఇందాక చెప్పిన సెలబ్రిటీస్ ఉన్నారు కదా వాళ్ళు తమ క్రష్ లను కలుసుకోవడం, వాళ్లకి దగ్గరవడం, వాళ్ళనే పెళ్లి చేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇదేదో సినిమా కథ అని మీరనుకుంటున్నట్టు ఉన్నారు. కాదు ఇది 10 మంది సెలబ్రిటీల విషయంలో నిజమైంది. అందరి విషయంలో ఇలాంటి అద్భుతాలు జరగవు.కొంతమంది విషయంలో జరిగాయి. అభిమాని అంటూ వెళ్లి ఆలుమగలు అయిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఆ సెలబ్రిటీలు.. ఆ అభిమానులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) విగ్నేష్ శివన్ – నయనతార :

నిన్ననే పెళ్లి చేసుకున్నారు కాబట్టి వీళ్ళ గురించి మొదట మాట్లాడుకుందాం. కోలీవుడ్ దర్శకుడు ప్రస్తుతం నయనతార మొగుడు అయిన విగ్నేష్ సినిమాల్లోకి రాకముందు నయనతారకి పెద్ద అభిమాని. డైరెక్టర్ అయ్యాక ఆమెతో ఓ సినిమా చెయ్యాలి అనుకున్నాడు.తాను అనుకున్నట్టుగానే నయన్.. ‘నానుమ్ రౌడీ ధాన్’ అనే చిత్రం చేశాడు. అక్కడి నుంచి వీళ్ళ ప్రేమకథ మొదలైంది. నయనతార హీరోయిన్ గా ఫేడౌట్ అయిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు విగ్నేష్ ఆమె జీవితంలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆమె చేయబోయే సినిమాల కథల ఎంపికలో, అలాగే నయన్ లుక్స్ వంటివి విగ్నేష్ హ్యాండిల్ చేశాడు. ఆమె లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. తర్వాత నయన్ బిజినెస్ వ్యవహారాలను కూడా విగ్నేష్ దగ్గరుండి చూసుకునేవాడు. ఫైనల్ గా తన క్రష్ నే పెళ్లి చేసుకున్నాడు.

2) విక్కీ కౌశల్ – కత్రీనా కైఫ్ :

సినిమాల్లోకి రాకముందు నుండి కత్రీనాకి వీరాభిమాని విక్కీ కౌశల్. ఇక సినిమాల్లోకి వచ్చాక.. కత్రీనాకి దగ్గరయ్యాక ఆమెనే పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయాడు. తన కంటే 4 ఏళ్ళు చిన్నవాడు అయినప్పటికీ కత్రీనా.. విక్కీని పెళ్లి చేసుకుంది.

3) అలియా భట్ :

టీనేజ్ లో ఉన్నప్పటి నుండి రణబీర్ కు అలియా పెద్ద ఫ్యాన్. అటు తర్వాత ఇద్దరూ ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు.

4) రజినీ కాంత్ – లత :

అప్పట్లో లత గారు ఫిలిం జర్నలిస్ట్, రజినీ ఫ్యాన్ కూడా..! రజినీని ఇంటర్వ్యూ చేసి ఫ్లాట్ చేశారు లత గారు. కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్లో ఎంతో మంది ఆదర్శమైన జంటగా నిలిచారు.

5) విజయ్ – సంగీత :

సంగీత విజయ్ కు పెద్ద ఫ్యాన్. విజయ్ ను కలుసుకోడానికి ఆమె విదేశాల నుండి వచ్చింది. విజయ్ బ్రేక్ టైంలోనే ఈమెను కలిసాడు. ఆ తర్వాత ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. ఇక తర్వాత సంగతి తెలిసిందేగా..!

6) మాధవన్ – సరిత :

మాధవన్ కు సరిత పెద్ద ఫ్యాన్.! హీరో కాకముందు కమ్యూనికేషన్ క్లాసెస్ చెప్పేవాడు మాధవన్. ఆ క్లాస్ లో స్టూడెంట్ గా అటెండ్ అయ్యేది సరిత. మాధవన్ హీరో అయ్యాక అతని పై క్రష్ ఫీలింగ్ పెరిగింది. తర్వాత ఒకేసారి అతన్ని కలుసుకోవడం.. తర్వాత అది ప్రేమగా మారడం జరిగింది. ఫైనల్ గా వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.

7) రాజేష్ ఖన్నా – డింపుల్ కపాడియా :

బాలీవుడ్ హీరో రాజేష్ ఖన్నా కి పెద్ద అభిమాని.. డింపుల్. ఓసారి వీళ్ళు కలుసుకున్నారు. అంతే ఆ పరిచయం పెళ్లి పీటల వరకు వెళ్ళింది.

8) దిలీప్ కుమార్ – సైరాభాను :

12 ఏళ్ళ వయసు నుండి దిలీప్ కు పెద్ద ఫ్యాన్ సైరా. చివరికి ఎలాగోలా పెళ్లి చేసేసుకుంది.

9) అజిత్ – షాలిని :

అజిత్ కు షాలిని ఓ అభిమాని. కట్ చేస్తే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకునేలా చేశాడు దేవుడు.

10) అర్జున్ – నివేదిత :

అర్జున్ కు నివేదిత అభిమాని. ఆమె కూడా హీరోయిన్ అయ్యాక అర్జున్ కు జోడీగా ఓ సినిమాలో ఎంపికైంది. ఆ సినిమా షూటింగ్ టైములో అర్జున్ కు గాయాలు అయ్యాయి. ఆ టైములో అతనికి దగ్గరుండి సేవలు చేసింది. అంతే వీళ్ళ మధ్య ప్రేమ చిగురించింది. పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది విషయం.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus