‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!

ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమాని నిర్మించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఓ పెద్ద సినిమాని తెరకెక్కించాలి దర్శకుడు అనుకుంటే ఆ బడ్జెట్ ను తట్టుకునే నిర్మాత కావాలి. హీరోకి భారీ రెమ్యూనరేషన్ పెట్టేవాడు అయ్యుండాలి, కాస్టింగ్ విషయంలో కూడా పాన్ ఇండియా అప్పీల్ ఉండాలి. ముఖ్యంగా హిందీలో క్రేజ్ ఉన్నవాళ్లని ఎంపిక చేసుకోగలగాలి. ప్రమోషన్ కు కూడా కోట్ల రూపాయలు పెట్టాలి. ఇంత చేసి సినిమాకి రిలీజ్ రోజున నెగిటివ్ టాక్ వస్తే..

ఆ సినిమా బాక్సాఫీస్ నిలబడుతుంది అని ఖచ్చితంగా చెప్పలేము. కానీ కొన్ని సినిమాలు నిలబడ్డాయి. అది క్రేజీ కాంబినేషన్ వల్లనో.. విడుదల తేదీ మంచిది అవ్వడం వలనో.. సోలో రిలీజ్ దక్కడం వలనో కానీ.. నెగిటివ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి కమర్షియల్ సక్సెస్ అందుకున్న పెద్ద సినిమాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) జల్సా :

పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి సినిమా ఇది. భారీ హైప్ తో 2008లో రిలీజ్ అయ్యింది. కానీ మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల క్రేజ్.. సమ్మర్ సీజన్ అడ్వాంటేజ్ తో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది.

2) పరుగు :

అల్లు అర్జున్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా 2008 సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది.

3) బిజినెస్ మెన్ :

మహేష్ బాబు- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2012 లో విడుదలైంది. మొదటి రోజు ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ సంక్రాంతి సీజన్ కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

4) సన్ ఆఫ్ సత్యమూర్తి :

అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2015 సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యింది. మొదటి రోజే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసింది.

5) నాన్నకు ప్రేమతో :

ఎన్టీఆర్- సుకుమార్ కాంబినేషన్లో 2016 లో వచ్చిన ఈ మూవీ మొదటి రోజు నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసింది.

6) సరైనోడు : ‘

అల్లు అర్జున్- బోయపాటి శ్రీను డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ 2016 సమ్మర్ కానుకగా విడుదలైంది. మొదటి రోజు ఈ చిత్రానికి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ సమ్మర్ సీజన్ కలిసి రావడం, మాస్ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో సక్సెస్ ఫుల్ మూవీ గా నిలబడింది.

7) జనతా గ్యారేజ్ :

ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ 2016 లోనే విడుదలైంది. మొదటి రోజు ఈ చిత్రానికి నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

8) డిజె(దువ్వాడ జగన్నాథం) :

అల్లు అర్జున్- హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ 2017 లో రిలీజ్ అయ్యి మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేసింది.

9) జై సింహా :

బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2018 సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి రోజు ప్లాప్ టాక్ ను మూటకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది.

10) మహర్షి :

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ 2019 లో విడుదలై మొదటి రోజే డివైడ్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ సమ్మర్ సీజన్ కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకుంది.

11) వెంకీ మామ :

వెంకటేష్- నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ 2019 చివర్లో రిలీజ్ అయ్యి మొదటి రోజు మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది.

12) సరిలేరు నీకెవ్వరు :

మహేష్ బాబు – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ 2020లో విడుదలై నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది.

13) పుష్ప ది రైజ్ :

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2021 చివర్లో రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీ అనిపించుకుంది.

14) బంగార్రాజు :

నాగార్జున- నాగ చైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి రోజు నెగిటివ్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది.

15) సర్కారు వారి పాట :

మహేష్ బాబు హీరోగా నటించిన ఈ మూవీ సమ్మర్ కానుకగా రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్స్డ్ టాక్ ను మూటకట్టుకుంది. కానీ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ మూవీగా నిలిచింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus