Adivi Sesh: పెళ్లి విషయంలో అడివి శేష్ నిర్ణయమిదే.. ఏం చెప్పారంటే?

  • December 17, 2023 / 12:12 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విజయాలను సొంతం చేసుకుంటున్న హీరోలలో అడివి శేష్ ఒకరు. అడివి శేష్ గత కొంతకాలంగా షూటింగ్ లకు దూరంగా ఉన్నా ప్రస్తుతం వరుస షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. అడివి శేష్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉందని సమాచారం అందుతోంది. అడివి శేష్ మాట్లాడుతూ ప్రస్తుతం పెళ్లి ఆలోచన లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎక్కువ రోజులు స్క్రిప్ట్ వర్క్ చేయడం వల్ల ఒకేసారి రెండు సినిమాలు చేశానని అడివి శేష్ పేర్కొన్నారు.

గూఢఛారి1 మూవీ ఎక్కడ ఆగిందో గూఢఛారి2 అక్కడినుంచి మొదలవుతుందని ఈ సినిమా పక్కా సీక్వెల్ గా ఉంటుందని అడివి శేష్ కామెంట్లు చేశారు. శృతి హాసన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నానని ఆ సినిమా హై లెవెల్ లవ్, యాక్షన్ సీన్లతో ఉంటుందని పేర్కొన్నారు. ప్రేక్షకులకు నచ్చేలా సినిమా తీస్తే వాళ్లు కచ్చితంగా చూస్తారని ఆయన కామెంట్లు చేయగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య కాలంలో రిలీజైన సినిమాలలో హాయ్ నాన్న మూవీ ఎంతగానో నచ్చిందని సరైన సమయం చూసి రివ్యూ ఇస్తానని అడివి శేష్ తెలిపారు. అడివి శేష్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. అడివి శేష్ రాబోయే రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. అడివి శేష్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది.

అడివి శేష్ (Adivi Sesh) వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తల గురించి అడివి శేష్ నుంచి స్పందన రావాల్సి ఉంది. అడివి శేష్ కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. అడివి శేష్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథ, కథనం ఉన్న సినిమాలను ఎంచుకోవడం వల్ల వరుస విజయాలు దక్కుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus