Swathi Muthyam: స్వాతిముత్యంకు అడ్వాన్స్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా?

  • October 1, 2022 / 01:54 PM IST

సాధారణంగా సంక్రాంతి కానుకగా ఎన్ని సినిమాలు విడుదలైనా పాజిటివ్ టాక్ వచ్చిన అన్ని సినిమాలు మంచి కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. అయితే దసరా పండుగకు మాత్రం ప్రేక్షకులు ఒకటి లేదా రెండు సినిమాల కంటే ఎక్కువ సినిమాలు చూడటానికి ఆసక్తి చూపరు. దసరాకు రిలీజవుతున్న గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాలలో ఏ సినిమాను చూడాలో ప్రేక్షకులు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో ఈ రెండు సినిమాలతో పాటు స్వాతిముత్యం సినిమా రిలీజవుతోంది.

గాడ్ ఫాదర్, ది ఘోస్ట్ సినిమాల సందడి ముగిసే వరకు స్వాతిముత్యం సినిమాను ప్రేక్షకులు పట్టించుకునే అవకాశం లేదు. అందువల్ల స్వాతిముత్యం మేకర్స్ సినిమా సక్సెస్ సాధించాలనే ఉద్దేశంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో బాహుబలి2 సినిమాకు ఫాలో అయిన అడ్వాన్స్ స్ట్రాటజీని ఇప్పుడు స్వాతిముత్యం సినిమాకు కూడా ఫాలో కానున్నారు. అక్టోబర్ నెల 4వ తేదీనే రెండు తెలుగు రాష్ట్రాలలో స్వాతిముత్యం స్పెషల్ ప్రీమియర్లు ప్లాన్ చేశారని తెలుస్తోంది.

ఈ స్ట్రాటజీ వర్కౌట్ అయితే భవిష్యత్తులో చిన్న సినిమాలు పండుగలకు విడుదలైన సమయంలో ఇదే స్ట్రాటజీని ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. స్పెషల్ ప్రీమియర్ల వల్ల అర్ధరాత్రి సమయానికే సినిమాకు సంబంధించిన రివ్యూలు వెబ్ సైట్లలో వస్తాయి. రివ్యూలు పాజిటివ్ గా ఉంటే స్వాతిముత్యం సినిమాకు ప్లస్ అవుతుందని రివ్యూలు నెగిటివ్ గా ఉంటే సినిమాకు మైనస్ అవుతుందని చెప్పవచ్చు.

స్వాతిముత్యం మేకర్స్ సినిమా రిజల్ట్ పై కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళుతుండగా సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. బెల్లంకొండ గణేష్ కెరీర్ కు ఈ సినిమా సక్సెస్ కీలకమని చెప్పవచ్చు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే బెల్లంకొండ గణేష్ కు మరిన్ని సినిమా ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బెల్లంకొండ గణేష్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus