Arohi Rao: ‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 6’ ప్రారంభమై రెండు వారాలు పూర్తయింది. విజయవంతంగా 3వ వారం రన్ అవుతుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠత అందరిలోనూ నెలకొంది. మొదట్లో 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గత వారం డబల్ ఎలిమినేషన్ జరిగింది కాబట్టి ఇంకా 19 మంది ఉంటారు. ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ‘బిగ్ బాస్ 6’ లోకి 19వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చింది ఆరోహి రావ్. హౌస్ లో ఈమె సైలెంట్ గా ఉన్నట్టు కనిపించినా.. ఎవరైనా టార్గెట్ చేస్తే చురకలు అంటించడం మనం చూస్తూనే ఉన్నాం. ఈమె గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రండి :

1) టీవీ నుండి ప్రతి సీజన్ కు బిగ్ బాస్ లో ఎవరో ఒకరు పాల్గొంటున్నారు. ఈసారి ఆరోహి రావ్ ఎంట్రీ ఇచ్చింది. ఈమె పక్కా తెలంగాణ అమ్మాయి.

2) వరంగల్ లో పుట్టి పెరిగింది.1996 వ సంవత్సరం సెప్టెంబర్ 9న ఈమె జన్మించింది. వరంగల్ లో ఒక మారుమూల గ్రామంలో పుట్టిన ఆరోహి రావ్ చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడింది.

3) వరంగల్ లోనే స్కూలింగ్ చేసిన ఆరోహి రావ్.. అటు తర్వాత హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.

4) చిన్నప్పటి నుండి ఈమెకు నటనపై ఆసక్తి ఎక్కువ. కానీ సినీ పరిశ్రమకు చెందిన బ్యాక్ గ్రౌండ్ లేకపోవడంతో మొదట ఆమె ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు.

5) చదువు పూర్తయ్యాక ఈమె ‘భీమ్స్ మీడియా’ లో యాంకర్ గా పనిచేసింది.

6) అటు తర్వాత పొలిటికల్ బెంచ్, తుపాకీ, స్టూడియో న్యూస్, స్టూడియో వన్ ఛానల్ లో కూడా పనిచేసింది.

7) 2020 లో ఈమె టీవీ9 లో యాంకర్ గా జాయిన్ అయ్యింది. అక్కడ యాంకర్ అంజలి గా ఫేమస్ అయ్యింది. ఇస్మార్ట్ న్యూస్ చదువుతూ తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.

8) ఆరోహి రావ్ కు ట్రావెలింగ్ మరియు షాపింగ్ అంటే చాలా ఇష్టం.

9) ఆరోహి రావ్ జీవితంలో చాలా ట్రాజెడీ ఉంది. చిన్నప్పుడే తన తల్లి చనిపోయింది. అదే సమయంలో తన గురించి ఆలోచించకుండా తండ్రి వేరే పెళ్లి చేసుకున్నాడు.

10) చిన్నప్పటి నుండి ఆరోహి రావ్.. తన అమ్మమ్మ ఇంట్లోనే పెరిగింది. చదువు పూర్తయ్యాక ఈమె హైదరాబాద్ కు అవకాశాలు కోసం వచ్చిన కొత్తలో ఆమె క్యాస్టింగ్ రూపంలో చాలా లైంగిక దాడుల నుండి తప్పించుకుంది.

తన జీవితంలో ఫేస్ చేసిన చీకటి కోణాలను అందరికీ చెప్పుకోవాలని ఒంటరిగా ఉన్న టైంలో చాలా బాధపడేదట. ‘బిగ్ బాస్’ వేదికగా అవి జనాలతో పంచుకోవడం తనకు సంతృప్తినిచ్చినట్టు ఆమె చెప్పుకొచ్చింది.

‘బిగ్ బాస్’ లో పాల్గొనాలని గత 3 సీజన్లుగా ట్రై చేసిన ఆరోహి మొత్తానికి ఈ సీజన్లో ఛాన్స్ దక్కించుకుంది. మరి ‘బిగ్ బాస్ 6’ లో ఈమె ఎంత వరకు రాణిస్తుందో చూడాలి..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus