Yash: ‘కె.జి.ఎఫ్’ ఫేమ్ యష్ నెక్స్ట్ మూవీ ‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

  • December 8, 2023 / 03:08 PM IST

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 1 , ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2 ‘ సినిమాలతో తెలుగు నాట కూడా సంచలనాలు సృష్టించాడు యష్. ఆ రెండు సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ‘కె.జి.చాప్టర్ 2 ‘ సినిమా 2022 ఏప్రిల్ 14 న రిలీజ్ అయ్యింది. దాని తర్వాత యష్ చేయబోయే సినిమా ఏంటి అనే విషయం పై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. అయితే మొత్తానికి ఆ సస్పెన్స్ కి తెరదించుతూ త‌న కొత్త సినిమాను ప్ర‌క‌టించాడు యష్.

‘టాక్సిక్ – ఏ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్స్ అప్స్‌’ అనే పేరుతో (Yash) యష్ కొత్త సినిమా రూపొందనుంది. డైరెక్ట‌ర్ గీతూ మోహ‌న్‌దాస్ యష్ 19 వ సినిమాని తెరకెక్కించనున్నారు. తాజాగా ‘టాక్సిక్’ టైటిల్ గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించడం జరిగింది. 2025 ఏప్రిల్ 10న ఈ సినిమా కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో కూడా ఏక కాలంలో రిలీజ్ కానుంది. అంటే 3 ఏళ్ళ తర్వాత యష్ మూవీ రాబోతుందన్న మాట.

ఇక.. ‘కెవిఎన్ ప్రొడ‌క్ష‌న్స్‌’, ‘మాన్‌స్ట‌ర్ మైండ్ క్రియేష‌న్స్’ బ్యాన‌ర్స్‌పై వెంక‌ట్ కె.నారాయ‌ణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు.’కె.జి.ఎఫ్'(సిరీస్) తర్వాత యష్ కి వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని మాస్‌, యాక్ష‌న్ అంశాల‌తో స్క్రిప్ట్ ను రెడీ చేయడం కోసం ఇంత టైం తీసుకున్నట్టు నిర్మాత వెంక‌ట్ కె.నారాయ‌ణ తెలియజేసారు.

అలాగే ఈ ”టాక్సిక్’… రెండు వేర్వేరు ప్రపంచాల క‌ల‌యిక‌గా ఉంటుందని, య‌ష్‌ ఇమేజ్ కి తగ్గ కథ ఇది’ అంటూ డైరెక్టర్ గీతూ మోహ‌న్‌దాస్ చెప్పుకొచ్చారు. ఇక దర్శకురాలు జీతూ మలయాళం,హిందీ భాషల్లో రూపొందించిన ‘మూతన్’ మంచి విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా ‘సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ 2016లో ‘గ్లోబల్ ఫిల్మ్ మేకింగ్ అవార్డు’ కూడా అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేశారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags