3 ఏళ్ళ తర్వాత 1945 విడుదల.. ప్రమోషన్లకు రానా వస్తాడా..!

  • December 9, 2021 / 09:47 PM IST

దగ్గుబాటి రానా హీరోగా మొదలైన పీరియాడికల్ సినిమాల్లో ‘1945’ కూడా ఒకటి.సత్యశివ దర్శకుడు. దాదాపు 3 ఏళ్ళ క్రితం ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. కానీ ఆర్ధిక లావాదేవీల కారణంగా ఆగిపోయింది. 2019 లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కానీ ఆ టైములో హీరో రానా ఈ చిత్రం షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. అలా ఆగిపోయి కూడా సంవత్సరం అయ్యింది. దర్శక నిర్మాతలు ఈ చిత్రం విడుదల గురించి నాతో డిస్కస్ చేయలేదు. డబ్బుల కోసం ఇప్పుడు రిలీజ్ అంటున్నారు.

దీనిని మీరు ఎంకరేజ్ చేయొద్దు అంటూ రానా తన సోషల్ మీడియాలో స్పందించాడు. ఇందుకు నిర్మాత రాజరాజన్ మాట్లాడుతూ.. ఈ సినిమా పై చాలా ఇన్వెస్ట్ చేశాను. 2 నెలల పైనే షూటింగ్ చేసాము. సినిమా పూర్తయ్యిందో లేదో చెప్పాల్సింది స్క్రిప్ట్ వర్క్ చేసిన దర్శకుడు. నచ్చిందో లేదో చెప్పాల్సింది ప్రేక్షకులు అంటూ రానా కామెంట్స్ కు సెటైర్ వేసాడు. అయితే ఈ చిత్రాన్ని సి. కల్యాణ్ రిలీజ్ నిర్మించినట్టు ఈరోజు విడుదల చేసిన పోస్టర్ లో ఉంది.

అంతేకాదు ఈ చిత్రాన్ని డిసెంబర్ 31న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయట. ట్రైలర్ కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. మరి ఈ సినిమా ప్రమోషన్లకు రానా వస్తాడా? లేక ‘ఆరడుగుల బుల్లెట్’ కు గోపీచంద్ సైలెంట్ గా ఉన్నట్టు సైలెంట్ గా ఉంటాడా అనేది తెలియాల్సి ఉంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus