సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా అలరించడమే కాదు.. నిజజీవితంలో అందరితోను మంచిగా మాట్లాడుతారు. నవ్వుతూ మాట్లాడుతూ అందరి మనసులో మంచి వ్యక్తిగా స్థానం సంపాదించుకున్నారు. ఆ స్థానాన్ని ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కైవశం చేసుకున్నారు. సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగ్స్ తో చప్పట్లు కొట్టించుకునే తారక్ .. బిగ్ బాస్ షోలో ఆత్మీయంగా మాట్లాడి అదరగొడుతున్నారు. ఈ షో చూసే ప్రతి ఒక్కరినీ తన మాటలతో అభిమానులుగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ షోలో పార్టిసిపెంట్స్ ని గౌరవంగా పిలుస్తూ మనసులు గెలుచుకుంటున్నారు.
స్టార్ హోదా కలిగిన ఎన్టీఆర్, తన కంటే చిన్న వారిని సైతం “గారు” అని పిలుస్తూ తెలుగు బుల్లితెర ప్రేక్షకుల అభిమాన హీరోగా మారిపోయారు. ఇక షోని ఎన్టీఆర్ ఉత్సాహంగా నడిపించే తీరుకి యూత్ కూడా టీవీల ముందు అతుక్కుపోతున్నారు. అందుకే వెండి తెరలోను, బుల్లి తెరలోను చిరంజీవి తర్వాతి స్థానం ఎన్టీఆర్ కె అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.