మరోసారి తన మాజీ భార్యను కలుసుకున్న స్టార్ హీరో..!

Advertisement

గతేడాది చివర్లో విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించారు ఆమిర్‌ ఖాన్‌, కిరణ్‌రావు ల. వీళ్ళ 15ఏళ్ళ కాపురానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆ ప్రకటన చేశారు. అయితే మొన్నామధ్య వీరి కుమారుడు ఆజాద్‌ రావు ఖాన్‌ బర్త్‌డేను కూడా వీరిద్దరూ కలిసి సెలబ్రేట్ చేశారు. తాజాగా ఈ జంట మరోసారి కలిసి దర్శనమిచ్చింది. నిన్న జరిగిన బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్‌ జోహార్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్ పార్టీలో ఈ జంట కలిసింది.

ఆమిర్‌ ఖాన్ బ్లూ కలర్ డ్రెస్‌లో ‘మెన్ ఇన్ బ్లూ’ అన్నట్టు కనిపిస్తే కిరణ్‌ రావు సిల్వర్‌ డ్రెస్సులో కనిపించింది.వీరిద్దరూ రెడ్‌ కార్పెట్‌ పై నిలబడి ఒకరినొకరు పలకరించుకుంటున్నప్పుడు కురిసిన నవ్వులను కెమెరామెన్ బంధించాడు.తర్వాత ఇద్దరూ హుందాగా ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటో చూస్తుంటే వీళ్ళిద్దరూ కలిసే ఉన్నారా? లేక మళ్ళీ కలిసిపోయారా? అనే ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటాయి. ‘అందుకే ఓ నెటిజెన్ ఇదేంటి? వీళ్లు విడాకులు తీసుకోలేదా?’ అంటూ కామెంట్ పెట్టాడు.

దానికి కొంతమంది విడాకులు తీసుకున్నంత మాత్రాన కలిసి మాట్లాడుకోకూడదా, నవ్వుకోకూడదా అంటూ సమాధానం ఇచ్చాడు. విడిపోయినంత మాత్రాన శత్రువులు అయిపోయినట్టు కాదు, శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళ కాపురానికి ఫలితంగా పిల్లలు ఉన్నారు కాబట్టి..

వీళ్ళు ఏదో ఒక సందర్భంలో కలిసి చేయాల్సిన కొన్ని పనులు కూడా ఉంటాయి. ఇలా హుందాగా ప్రవర్తించకపోతే ఆ సమయంలో ఒకరి మొహం ఒకరు చూసుకోవడం కష్టం.. అంటూ మరికొంతమంది వివరిస్తున్నారు. అయితే వీళ్ళు కలిసి దిగిన లేటెస్ట్ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus