‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!

ఓల్డ్ ఈజ్ గోల్డ్..అని చాలా మంది అంటుంటారు. ఎప్పటికీ పాతబడని వాక్యం ఇది. సరిగ్గా అప్ కమింగ్ ఫిలిమ్స్ కూడా ఇదే పద్దతిని ఫాలో అవుతున్నాయి. ఏ విషయంలో అంటారా… పాత సినిమాల టైటిల్స్ ను వాడుకునే విషయంలో. గతంలో సూపర్ హిట్ అయిన సినిమా టైటిల్ ను వాడుకుంటే క్రేజ్ బాగా వస్తుందనో… లేక కథ డిమాండ్ చేయడం వలనో కానీ.. చాలా మంది యంగ్ హీరోలు పాత సినిమాల టైటిల్స్ ను తమ అప్ కమింగ్ ఫిలిమ్స్ కు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.యంగ్ హీరోలు మాత్రమే కాదు ఈ లిస్ట్ లో చాలా మంది ఉన్నారు కాకపోతే యంగ్ హీరోలు ముందు ఉన్నారు. అయితే హిట్టు సినిమా టైటిల్ పెట్టుకున్నంత మాత్రాన సినిమా హిట్ అయిపోతుంది అనుకోవడం అతిశయోక్తి అవుతుంది.

కథ డిమాండ్ మేరకు సినిమా టైటిల్ ను పెట్టుకోవాలి. పైగా పాత హిట్ సినిమాల టైటిల్స్ ను పెట్టుకుని సినిమా బాలేదు అంటే ముందుగా జనాలు టైటిల్ గురించే ఎక్కువ తిడతారు. ఓ సూపర్ హిట్ సినిమా లేదా క్లాసిక్ సినిమా టైటిల్ ను చెడగొట్టారు అని. ఈ విషయాన్ని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. సరే మరీ పర్సనల్ గా తీసుకోవడం ఎందుకు కానీ.. పాత సినిమాల టైటిల్ ను వాడుకున్న.. వాడుకుంటున్న హీరోలు ఎవరో, ఒకవేళ పాత సినిమాల టైటిల్స్ ను వాడుకోవడం వల్ల వాళ్ళ సినిమాలు హిట్ అయ్యాయో లేక ప్లాప్ అయ్యాయో… అన్న విషయాలను ఓ లుక్కేద్దాం రండి :

1) తొలిప్రేమ :

ఈ టైటిల్ తో 1999 లో పవన్ కళ్యాణ్- కరుణా కరణ్ కాంబినేషన్లో ఓ సినిమా వచ్చింది. అది కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా మిగిలింది. 2018 లో వరుణ్ తేజ్ ఈ టైటిల్ ను తన సినిమాకి పెట్టుకున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.

2) గూఢచారి :

‘గూఢచారి 116’ పేరుతో సూపర్ స్టార్ కృష్ణ గారి మూవీ ఒకటి వచ్చింది. జేమ్స్ బాండ్ తరహా మూవీ అది. 2018 లో అడివి శేష్ ‘గూఢచారి’ అనే సినిమా చేశాడు. పాత టైటిల్ ను వాడుకుని సూపర్ హిట్ అందుకున్నాడు. కథాంశం కూడా అదే రేంజ్లో ఉంటుంది.

3) దేవదాస్ :

అక్కినేని నాగేశ్వర రావు గారి కల్ట్ క్లాసిక్ మూవీ ఇది. ఇదే టైటిల్ తో నాగార్జున- నాని ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ చేశారు.2018లో వచ్చిన ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

4) ఖైదీ :

చిరంజీవిని స్టార్ హీరోని చేసిన మూవీ ఇది. అయితే ఇదే టైటిల్ ను కార్తీ 2019 లో వాడుకున్నాడు. ఈ ‘ఖైదీ’ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది.

5) మహర్షి :

డైరెక్టర్ వంశీ గారు తీసిన లవ్ స్టోరీ ఇది.. 2019 లో ఈ టైటిల్ ను మహేష్ బాబు తన 25వ సినిమా కోసం వాడుకున్నాడు. ఈ మూవీ కూడా హిట్ అయ్యింది.

6) గ్యాంగ్ లీడర్ :

చిరంజీవి హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ టైటిల్ ఇది. దీనిని 2019 లో నాని వాడుకున్నాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

7) సుల్తాన్ :

బాలకృష్ణ ట్రిపుల్ రోల్ ప్లే చేసిన మూవీకి ఈ టైటిల్ పెట్టారు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది. అదే టైటిల్ ను కార్తీ వాడుకున్నాడు. ఫలితంలో పెద్ద తేడా అయితే లేదు.

8) విజేత :

చిరంజీవి హీరోగా వచ్చిన సూపర్ హిట్ మూవీ టైటిలే ఇది కూడా..! 2018 లో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ఈ టైటిల్ ను వాడుకున్నాడు. అయితే ఈ మూవీ ప్లాప్ అయ్యింది.

9) మేజర్ :

చిరంజీవి కన్నడలో డబ్బింగ్ రోల్ ప్లే చేసిన ‘సిపాయి’ చిత్రాన్ని తెలుగులో ‘మేజర్’ గా రిలీజ్ చేశారు.కానీ ఇక్కడ ఆ మూవీ ఆడలేదు. ఇప్పుడు ఇదే టైటిల్ తో అడివి శేష్ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఇదెలా ఉంటుందో చూడాలి.

10) దొంగ :

చిరంజీవి హీరోగా అనే చిత్రం వచ్చింది. ఈ మూవీ యావరేజ్ గా ఆడింది. 2020 లో ఇదే టైటిల్ ను కార్తీ హీరోగా చేసిన మూవీకి పెట్టుకున్నాడు. ఈ మూవీ ఆడలేదు.

11) విక్రమ్ :

నాగార్జున హీరోగా ఎంట్రీ ఇచ్చిన మూవీ పేరు ‘విక్రమ్’. ఇదే టైటిల్ తో కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీ త్వరలో రాబోతుంది.

12) ఖుషి :

పవన్ కళ్యాణ్ నటించిన ఈ మూవీ ఆల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా, అలాగే కల్ట్ క్లాసిక్ మూవీగా నిలిచింది. ఈ చిత్రం టైటిల్ ను విజయ్ దేవరకొండ వాడుకుంటున్నాడు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి..!

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus